iDreamPost

Video: రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో చూస్తే వెన్నులో వణుకే!

Road Accident: నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. కొన్ని ఘటలు చూసినప్పుడు ఒంట్లో వణుకు పుడుతోంది. అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Road Accident: నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. కొన్ని ఘటలు చూసినప్పుడు ఒంట్లో వణుకు పుడుతోంది. అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Video: రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో చూస్తే వెన్నులో వణుకే!

మృత్యువు అనేది మూడు అక్షరాల పదమే. కానీ అది మన చుట్టూ ఉన్న నాలుగు దిక్కుల్లోని ఎటువైపు నుంచైన రావచ్చు.  అలా అనుకోని  సంఘటనలతో మృత్యువు జీవులను కంబళిస్తుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు కాచుకుని కూర్చుకుంటుంది. తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది బలవుతున్నారు. అయితే ఈ ప్రమాదాలు ఎక్కువగా కొందరి నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకుంటాయి. తాజాగా రెప్పపాటులో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే.. వెన్నులో వణుకు పుట్టాల్సిందే అన్నట్లు ఉంది.

ఏదైనా ఘోర ప్రమాదం జరిగినప్పుడు కొందరు ప్రాణాలతో బయట పడుతుంటారు. అలాంటి వారిని చూసినప్పుడు..వీళ్లకి భూమి మీద నూకలు ఉన్నాయి..రా అని అనుకుంటారు. అవును ఆ మాటల్లో నిజం ఉంది. కొన్ని కొన్ని ఘోరమైన ప్రమాదాలు చూసినప్పుడు మనకు అదే అనిపిస్తుంది. ఇక ఆ ప్రమాదంలో ఎవరు బతికి బయట పడే ఛాన్స్ లేదు అని అందరు భావించే తరణంలో కొందరు మృత్యుంజయుల మాదిరి ప్రాణాలతో బయటపడతుంటారు. అలానే భూమి నూకలు లేకుంటే తాడే పామై కాటేస్తుందని కూడా అంటారు. అందుకే ఎంతో సురక్షితంగా భావించే ఫుట్ పాత్ లపై  కూడా  అనుకోని ప్రమాదా ఘటనలు జరుగుతుంటాయి. రోడ్డు పక్కనే నడుస్తూ సురక్షితంగా ఉన్నామని అనుకోలేని పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంటాయి. పక్కన నడుస్తున్న వారికిపైకి కూడ వాహనాలు దూసుకెళ్లి ప్రాణాలు తీసిన సందర్భాలు ఉన్నాయి.

తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. పుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న ప్రయాణికులను ఓ కారు అత్యంత వేగంగా వచ్చి.. ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగిన తీరు చూసి అందరు షాకి గురయ్యారు. వీడియోలో చూసినట్లు అయితే కొంత మంది రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై తమపాటికి తాము నడుచుకుంటూ వెళ్తున్నారు. తాము పుట్ పాత్ పై ఉన్నాము కదా..తమకేమి ప్రమాదం జరగదులే అని వాళ్లు భావించారు.  అలా వాళ్లంతా తాము సురక్షితంగానే ఉన్నాంభావించారు. కానీ, ఇంతలోనే వారిని కారు రూపంలో మృత్యువు కాటేసింది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌ పై నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులను బలంగా ఢీకొట్టింది. దాంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోరమైన ప్రమాదం తర్వాత గాయాలతో బయట పడిన వారంతా షాక్‌లో ఉండిపోయి చూస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో అనే వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి