iDreamPost

వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై యువతిపై కత్తితో దాడి చేస్తూ..!

వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై యువతిపై కత్తితో దాడి చేస్తూ..!

ఆడవాళ్లపై దాడులు, అఘాయిత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎంతో కఠిన శిక్షలు వేస్తున్నారు, చట్టాలను మరింత కఠినతరం చేస్తున్నారు. కానీ, కొందరు మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. నానాటికీ దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రేమించడం లేదని ఒకరు.. అనుమానంతో ఒకరు.. ప్రశ్నించిందని ఇంకొకరు ఇలా దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక యువతిపై జరిగిన దాడి నెట్టింట వైరల్ గా మారింది. ఒక యువకుడు పట్టపగలు యువతిని రోడ్డుపై పరుగులు పెట్టించాడు. ఆమెపై పదునైన ఆయుధంతో దాడికి దిగాడు.

ఈ దారుణం పూణెలో వెలుగు చూసింది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో యువకుడు దాడకి దిగాడు. ఓ 20 ఏళ్ల యువతి స్కూటీ మీద వెళ్తుండగా.. ఓ యువకుడు అడ్డుకున్నాడు. ఆమెపై దాడి చేసేందుకు ఒక కొడవలి లాంటి పదునైన ఆయుధాన్ని బయటకు తీశాడు. అది చూసి ఆ యువతి భయంతో స్కూటీ అక్కడ వదిలేసి రోడ్డుపై పరుగులు పెట్టింది. అతను ఆమె వెనకాలే వెంబడించాడు. ఆమె వీపుపై బలంకా దాడి చేయడంతో కిందపడిపోయింది. వెంటనే ఆమెపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న వాళ్లంతా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

వారిపై కూడా దాడి చేయాలని చూడటంతో అందరూ రాళ్లు తీసుకుని అతనిపై విసిరారు. ఆ తర్వాత అతడిని బందించి పోలీసులకు అప్పగించారు. స్థానికులు చూపించిన సమయస్ఫూర్తితో ఆ యువతి ప్రాణాలు కాపాడుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాడి సమయంలో అక్కడున్న వారు చూపించిన ధైర్యం, తెగువను నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. వాళ్లు చూపించిన ధైర్యం వల్లే ఆ యువతి ప్రాణాలతో ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అతనికి సరైన శిక్ష పడేలా చూడాలంటూ పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి