iDreamPost
android-app
ios-app

తెలుగు విద్యార్థులంతా ఆ యూనివర్సిటీకి క్యూ.. అక్కడ అంత స్పెషల్ ఏంటంటే?

Sandip University From Nasik- Telugu States Students: ఉన్నత విద్య కోసం మీరు ఒక మంచి విశ్వవిద్యాలయం కోసం చూస్తున్నారా? అయితే మీరు ఈ సందీప్ యూనివర్సిటీ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

Sandip University From Nasik- Telugu States Students: ఉన్నత విద్య కోసం మీరు ఒక మంచి విశ్వవిద్యాలయం కోసం చూస్తున్నారా? అయితే మీరు ఈ సందీప్ యూనివర్సిటీ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

తెలుగు విద్యార్థులంతా ఆ యూనివర్సిటీకి క్యూ.. అక్కడ అంత స్పెషల్ ఏంటంటే?

క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ.. అన్నీ ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, అత్యుత్తమ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఫారన్ స్టూడెంట్స్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రాం.. ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉన్న ఒక మంచి యూనివర్సిటీలో మీకు సీటు రావాలి అంటే కచ్చితంగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒకవేళ అంత ఖర్చు పెట్టినా కూడా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మంచి విద్యను అందిస్తారా? అనే అనుమానాలు అయితే ఉండనే ఉంటాయి. అలాంటి వారికి ఈ యూనివర్సిటీ చక్కని సమాధానంగా చెప్పచ్చు. ఇక్కడ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు.. ప్లేస్ మెంట్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు.

ఈ యూనివర్సిటీ పేరు సందీప్ యూనివర్సిటీ. ఇది మహారాష్ట్రలోని నాసిక్ లో ఉంది. 2008లో మొదట ఒకే ఒక్క ఇంజినీరింగ్ కాలేజ్ తో సందీప్ యూనివర్సిటీ ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు అది ఒక సెల్ఫ్ ఫండింగ్ యూనివర్సిటీగా ఎదిగింది. ఈ ప్రయాణం ఇంత దూరం సాగడానికి ప్రధాన కారణం ఈ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు సందీప్ ఎన్.ఝానే కారణం అని చెప్పచ్చు. సందీప్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఒక ఇంజినీరింగ్ కాలేజీని ఇప్పుడు వేల మంది విద్యార్థులకు మంచి విద్యను, భవిష్యత్తును అందించే ఒక గొప్ప విశ్వవిద్యాలంగా మలిచారు. ఈ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులకు ప్రత్యేకమైన సౌకర్యాలు, వెసులుబాటులు కూడా ఉండటం విశేషం.

యూనివర్సిటీ ప్రత్యేకతలు:

ఈ సందీప్ యూనివర్సిటీలో ముఖ్యంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తం 250 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని నిర్మించారు. ఈ వర్సిటీలో ఇంజినీరింగ్, పార్మసీ, ఎంబీఏ, లా వంటి అన్ని రకాల ఉన్నత విద్యా కోర్సులు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల ల్యాబ్స్, సెంట్రల్ లైబ్రరీ, వర్క్ షాప్స్, డిపార్టిమెంటల్ లైబ్రరీ, అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అలాగే ఈ మొత్తం యూనివర్సిటీ 20 లక్షల బిల్టప్ ఏరియాతో ఉంది. అలాగే ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం 17 రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా.. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్రికా వంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి సందీప్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్థున్నారు.

తెలుగు విద్యార్థుల కోసం:

ఈ సందీప్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే 2017లో కేవలం 25 మంది ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఏకంగా వెయ్యి దాటిపోయింది. ఏడాదికి వెయ్యికి పైగా విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ చదువుకుంటున్నారు. అంతేకాకుండా తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక మెస్ ని కూడా మెయిన్ టైన్ చేస్తున్నారు. ఎందుకంటే నార్త్ స్టైల్ ఫుడ్ ని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తినలేరని వారి కోసం ఇక్కడి నుంచే స్పెషల్ గా షెఫ్స్ ని కూడా తీసుకెళ్లి వంట చేయిస్తున్నారు.

Sandeep University

అంతేకాకుండా ఇక్కడ విద్యార్థులకు స్కాలర్ షిప్ సౌకర్యం కూడా ఉంటుంది. మీకు 90 శాతానికి మించి మార్కులు వస్తే.. ఎలాంటి ఫీజు లేకుండా ఇక్కడ చదువుకోవచ్చు. 80 శాతం కంటే ఎక్కువ మార్కుల వచ్చిన వారికి స్పెషల్ స్కాలర్ షిప్స్ కూడా ఉంటాయి. ఇంక 24 గంటల సర్వే లైన్స్, సీసీటీవీ, స్పెషల్ సెక్యూరిటీ కూడా ఇక్కడ ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ సందీప్ యూనివర్సిటీ అంటే తెలుగు విద్యార్థులు కూడా మక్కువ పెంచుకుంటున్నారు. పైగా మీరు ఉచితంగా వెళ్లి ఈ వర్సిటీని సందర్శించి రావచ్చు. దారి ఖర్చులు కూడా వాళ్లే పెట్టుకుంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి