iDreamPost

ప్రియురాలిని 31 ముక్కలుగా నరికి చంపిన లవర్.. ఏంజరిగిందంటే?

ఇటీవల దేశంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. కొంతమంది యువకులు ప్రేమించిన యువతను మోసం చేసి అత్యంత దారుణంగా హింసించి చంపేస్తున్నారు.

ఇటీవల దేశంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. కొంతమంది యువకులు ప్రేమించిన యువతను మోసం చేసి అత్యంత దారుణంగా హింసించి చంపేస్తున్నారు.

ప్రియురాలిని 31 ముక్కలుగా నరికి చంపిన లవర్.. ఏంజరిగిందంటే?

ఈ మధ్య చాలా మంది ప్రతి చిన్న విషయాలకు మనస్థాపానికి గురై ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిపై దాడులు చేయడం, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. కొన్ని సమయాల్లో ఆత్మహత్యకు పాల్పపడుతున్నారు. ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు పలు కారణాల వల్ల ఈ హత్యలు, ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల కొంతమంది కామంధులు తాము ప్రేమించిన అమ్మాయిలను దారుణంగా చంపేస్తున్నారు. ఢిల్లీలో శ్రద్దా వాకర్ హత్య తర్వాత అలాంటి దారుణ ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఓ యువతిని ప్రేమికుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఒడిశాలోని నబరంగ్ పూర్ జిల్లాకు చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించింది. కానీ అప్పటికీ ఆ వ్యక్తికి పెళ్లై ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారరు. బుధవారం ఇంటి నుంచి వెళ్లిన యువతి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. తల్లిదండ్రులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. చివరికి బరంగ్ పూర్ జిల్లాలో అటవీ ప్రాంతంలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని 31 భాగాలుగా నరికి భూమిలో పాతిపెట్టగా పోలీసుల విచారణలో శరీర భాగాలు బయటపడ్డాయి. తర్వాత శరీర భాగాలు పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.

ఈ కేసు గురించి రాయ్ ఘడ్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. బుధవారం యువతి ఇంటి నుంచి పారిపోయి ప్రేమించిన వ్యక్తి ఇంటికి వెళ్లింది. తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని ప్రేమికుడిని బలవంతం చేసింది.. ఈ క్రమంలోనే ప్రియుడు తన భార్యతో కలిసి హత్యకు పాల్పపడి ఉండవొచ్చు. ఈ అనుమానంతోనే భార్యాభర్తలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. మరణించిన యువతి వయసు 20 సంవత్సరాలు. తమ కూతురు చనిపోయిందన్న విషయం తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఢిల్లీలో శ్రద్దా వాకర్ హత్య తర్వాత రాజస్థాన్ లో గుడ్డీ అనే యువతిని ప్రేమికుడు ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో విసిరాడు. దర్యాప్తులో హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి