iDreamPost

Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి అలెర్ట్.. నేటి ధర ఎంతంటే?

Gold and Silver Rates: గత ఏడాది బంగారం భారీగా పెరిగిపోయింది.. ఈ ఏడాది చాలా వరకు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలు అయ్యింది.. దీంతో పసిడి ధరల్లో మళ్లీ మార్పులు వస్తున్నాయి.

Gold and Silver Rates: గత ఏడాది బంగారం భారీగా పెరిగిపోయింది.. ఈ ఏడాది చాలా వరకు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలు అయ్యింది.. దీంతో పసిడి ధరల్లో మళ్లీ మార్పులు వస్తున్నాయి.

Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి అలెర్ట్.. నేటి ధర ఎంతంటే?

ప్రపంచంలో బంగారంకి ఎంత విలువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే భారతీయలకు కూడా పసిడి అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. మార్కెట్ లోకి  కొత్త కొత్త వెరైటీ ఆభరణాలు వస్తుండటంతో మహిళలు వాటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా అలంకరణకు, ఆర్థికంగా బంగారం ఉపయోగ పడుతుండటంతో విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. నిత్యం అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు బంగారం, వెండిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక  నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పసిడి, వెండి తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తుంది. గత కొన్ని రోజులుగా దిగివచ్చన బంగారం ధరలు…తాజాగా మళ్లీ షాక్ ఇస్తున్నాయి. గురువారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రస్తుతం మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెరగడం మరింత భారాన్ని పెంచుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పసిడికి మంచి గిరాకీ ఉంది. గత వారం రోజుల్లో చూసుకుంటే కాస్త దిగివచ్చినట్లు కనిపించిన బంగారం ధరం గురువారం మళ్లీ పెరిగింది. దీంతో ముందు ముందు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ క్రమంలో మార్చి 28వ తేదీన హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో బంగారం , వెండి ధరలు రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

అంతర్జాతీయంగానూ పసిడి ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2190.45 డాలర్ల వద్ద ఉంది. ఇక వెండి ధర ఔన్సుకు 24.59 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. భారతీయ కరెన్సీ విలువ డాలర్ తో పోలిస్తే రూ.83.378 మార్క్ వద్ద అమ్ముడు అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం మార్చి 28న 22 క్యారెట్ల బంగారం ధరం తులానికి రూ.200 మేర పెరిగి.. రూ. 61,500గా కొనసాగుతోంది. అలానే 24 క్యారెట్ల బంగారం ధరల విషయానికి వస్తే.. 10 గ్రాములకు రూ.220 పెరిగింది.

ప్రస్తుతం తులం రేటు రూ. 67 వేల 80 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా ఢిల్లీ నగరంలో బంగారం విషయానికి వస్తే.. 22 క్యారెట్ల  పసిడి రేటు 10 గ్రాములకు రూ.200 మేర పెరిగి.. 61,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర తులానికి రూ.220 మేర పెరిగి రూ. 67,080 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ, విశాఖ లో ఇవాళ బంగారం ధరల విషయానికి వస్తే..22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,910 లు ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.63,170 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,300 వద్ద ట్రెండ్ అవుతుంది.

ఇక వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్ లో వెండి రేటు ఇవాళ కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. కిలో వెండి రేటు ఇవాళ రూ.300 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.77,200 ఉంది. అలానే ఢిల్లీ మార్కెట్లో కూడ కిలో వెండి రేటు హైదరాబాద్ మాదిరిగానే ఉంది. ఢిల్లీలో కూడా కిలో వెండి రూ.300 మేర దిగివచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ఢిల్లీలో రూ. 77,200 పలుకుతోంది. అయితే, జీఎస్‌టీ, ఇతర టాక్స్ లను కలుపుకొని ప్రాంతాలను బట్టి బంగారం, వెండి రేట్లలో స్వల్ప తేడాలు ఉండొచ్చు. బంగారం కోనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్లో ధరలు తెలుసుకోవడం మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి