iDreamPost

పెళ్లింట తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో ఏడుగురు దుర్మరణం!

  • Published Apr 18, 2024 | 10:47 AMUpdated Apr 18, 2024 | 10:47 AM

Maharashtra Crime News: పెళ్లి వేడుకల్లో ఎంతో సంతోషంగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి తిరుగు ప్రయాణమయ్యారు. ఎంతో సంతోషంతో బయలుదేరిన వారు అనుకోని పరిస్థితి ఎదుర్కొన్నారు.

Maharashtra Crime News: పెళ్లి వేడుకల్లో ఎంతో సంతోషంగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి తిరుగు ప్రయాణమయ్యారు. ఎంతో సంతోషంతో బయలుదేరిన వారు అనుకోని పరిస్థితి ఎదుర్కొన్నారు.

  • Published Apr 18, 2024 | 10:47 AMUpdated Apr 18, 2024 | 10:47 AM
పెళ్లింట తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో ఏడుగురు దుర్మరణం!

దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాల జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వారి కుటుంబాల్లో పెద్ద దిక్కు కోల్పోయి అనాథలుగా మిగులుతున్నారు. మద్యం మత్తు, నిద్ర లేమి, అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.  ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. అప్పటి వరకు తమ బంధువులతో ఎంతో సంతోషంగా పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత సంతోషంగా తమ ఇంటికి బయలుదేరారు. కానీ వారి సంతోషం ఒక్కసారే దుఖఃంగా మారిపోయింది.. మృత్యువు వారిని వెంబడించింది. ఈ ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది.

మహారాష్ట్రలో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. జాట్ జిల్లా సాంగ్లీ సమీపంలో కారును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోర సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ఐదుగురు అక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వీరంతా తమ సమీప బంధువు ఇంట పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.

వలస కూలీలతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు జాట్ నుంచి ముంబైకి వెళ్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. వేంగంగా వచ్చిన కారు.. బస్సును ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్లారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు కూడా గాయాలు కావడంతో వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. దాదాపు 10 నుంచి 15 మంది వరకు ప్రమాదంలో గాయపడ్డారని.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి