iDreamPost
android-app
ios-app

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దారుణం!

  • Published Apr 22, 2024 | 10:14 AM Updated Updated Apr 24, 2024 | 12:35 PM

ఈ మధ్య కాలంలో కొంతమంది మగాళ్లు ఆడవాళ్లు కనిపిస్తే చాలు మృగంగా మారిపోతున్నారు. నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు జరుగుతూనే ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో కొంతమంది మగాళ్లు ఆడవాళ్లు కనిపిస్తే చాలు మృగంగా మారిపోతున్నారు. నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు జరుగుతూనే ఉన్నాయి.

  • Published Apr 22, 2024 | 10:14 AMUpdated Apr 24, 2024 | 12:35 PM
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దారుణం!

ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ  మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి.  ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు మృగాళ్లుగా మారిపోతున్నారు. చిన్న పిల్లుల, వృద్దులు అని చూడకుండా కామంతో రెచ్చిపోతున్నారు. నిర్భయ, దిశ లాంటి కఠిన చట్టాలు వచ్చినా.. ఏమాత్రం భయం లేకుండా కామాంధులు దారుణాలకు పాల్పపడుతున్నారు. దీంతో మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ మహిళలపై అత్యాచారం, హత్యలకు సంబంధించిన కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కర్ణాటకలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దారుణ ఘటన జరిగింది.  వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు కొడిగేహళ్లి భద్రప్ప లేజౌట్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన శోభ (48) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో హత్య చేయబడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. శోభ గత కొంత కాలంగా స్థానికంగా ఓ డ్రైవింగ్ స్కూల్ రన్ చేస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండేది. ఎంతో కష్టపడి ఆర్థికంగా నిలదొక్కుంటుంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు.. హర్షిత, సుప్రియ. ఇటీవల ఇద్దరి కూతుళ్ల పెళ్లి జరిపించింది.  తన కూతుళ్లతో ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడుతూ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే హర్షిత తల్లితో మాట్లాడాలనిపించి ఫోన్ చేసింది. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. దీంతో కలత చెందిన హర్షిత వెంటనే తన తల్లిని చూడాలని భర్తతో చెప్పింది.

భార్యాభర్తలు తన తల్లి శోభ ఇంటికి చేరుకున్నారు. తలుపు తట్టగా ఎంతకు రెస్పాన్స్ రాకపోవడంతో కిటికీ లో నుంచి చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. తన తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి బోరున విలపించింది హర్షిత. వెంటనే తన సోదరి సుప్రియకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వివరించింది. వెంటనే ఆమె తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొంత కాలంగా శోభ భర్తకు దూరంగా కూతురి ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇంట్లో బంగారం, కారు లేవని.. ఎవరో తెలిసన వాళ్లే ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పపడి ఉంటారని కూతుళ్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.

jojobet girişJOJOBET GİRİŞgamdomCasibomjojobetJojobet Giriş