iDreamPost
android-app
ios-app

HYD ఫేమస్‌ రెస్టారెంట్స్‌లో ఇంత ఘోరమా.. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం

బయటకు బాగా రిచ్ లుక్కులో ఉందని, యాంబియన్స్ బాగుందని హోటల్స్, రెస్టారెంట్లకు వెళుతున్నారా. అయితే పప్పులో కాలేసినట్లే. హైదరాబాద్ మహా నగరంలో ప్రముఖ హోటళ్లలో డొల్లతనం బయటకు వచ్చింది.

బయటకు బాగా రిచ్ లుక్కులో ఉందని, యాంబియన్స్ బాగుందని హోటల్స్, రెస్టారెంట్లకు వెళుతున్నారా. అయితే పప్పులో కాలేసినట్లే. హైదరాబాద్ మహా నగరంలో ప్రముఖ హోటళ్లలో డొల్లతనం బయటకు వచ్చింది.

HYD ఫేమస్‌ రెస్టారెంట్స్‌లో ఇంత ఘోరమా.. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా తయారయ్యింది నేడు రెస్టారెంట్ల పరిస్థితి. బయట నుండి చూడటానికి క్లాసీ లుక్స్.. కానీ వంట గదిని చూస్తే మాత్రం ఊరమాస్. ఇవన్నీ భోజన ప్రియులకు పట్టకుండా యాంబియెన్స్ అంటూ నాలుగు మొక్కలు, కొత్త కొత్త పంథాలను అనుసరించి కవర్ చేస్తున్నారు. హోటల్స్ వెళ్లి తినే కస్టమర్లకు వంటగదిని పరిశీలించరు కనుక.. తాము ఏదీ పెడితే అది తింటారులే అని వ్యవహరిస్తున్నాయి రెస్టారెంట్స్, హోటల్స్ యజమానులు. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో వివిధ ప్రాంతాల ప్రజలు నివసిస్తుంటారు. వీకెండ్ వస్తే చాలు.. ఇంట్లో వండ చేసుకోవడం తక్కువ. రెస్టారెంట్స్, హోటల్స్ నుండి తెప్పించుకోవడమో లేక వెళ్లి తినడమో చేస్తున్నారు. అయితే నాణ్యత లేని ఆహార పదార్థాలు, నిల్వ చేసిన పదార్థాలను కస్టమర్లకు అందిస్తూ పట్టుబడ్డాయి.

ఇప్పటికే పలుమార్లు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టగా.. అనేక హోటళ్ల అసల స్వరూపం బయటకు వచ్చింది. ఇప్పుడు మరో రెస్టారెంట్ నిర్వాకం వెలుగు చూసింది. భాగ్య నగరిలో ఆహార నాణ్యతా ప్రమాణాలను పాటించని హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. కిచెన్‌ పరిశుభ్రంగా ఉండకపోవడం, లేబుల్స్ లేని, నాణత్య లేని ఆహార పదార్థాల వినియోగం, ఆహార పదార్థాలపై పురుగులు తిరుగుతుండటం వంటి వాటిని గుర్తించి చర్యలు చేపడుతున్నారు. తాజాగా శనివారం సాయంత్రం లక్డికాపూల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది ఫుడ్ సేఫ్టీ అధికారుల టాస్క్ ఫోర్స్ బృందం. హైదరాబాద్ నగరంలో ఫేమస్ స్టార్ హోటల్ అయిన రాయలసీమ రుచులు హోటల్లో సోదాలు నిర్వహించగా.. డొల్లతనం బయట పడింది.

రాయలసీమ రుచులు హోటల్‌లో పిండి వంటకు వినియోగించే మైదాలో పురుగులు తిరగడాన్ని గుర్తించారు. అలాగే చింతపండులో చింతపండులో కీటకాలు ఉన్నాయి. అలాగే డేట్ పూర్తైన అమూల్ పాలను కూడా వంటకాలను వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు. అలా గుర్తించిన 20 కిలోల మైదా, 2 కిలోల చింతపండును ధ్వంసం చేశారు. అలాగే హోటల్‌లో గడువు ముగిసిన అమూల్ గోల్డ్ పాలను, తయారీ లైసెన్స్‌ లేని రూ.16వేలు విలువైన గోలీసోడా (168 బాటిళ్లు) స్వాధీనం చేసుకున్నారు. లేబుల్ లేని జీడిపప్పు, జవారీ రోటీలను గుర్తించి తొలగించారు. అలాగే హోటల్‌లో పలు సమస్యలను కూడా గుర్తించారు. అదే ప్రాంతంలో షా గౌస్ హోటల్స్‌లో తనిఖీలు చేపట్టారు అధికారులు. ప్రముఖ రెస్టారెంట్లలో నాణ్యత లోపం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు ఆహార ప్రియులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి