iDreamPost

ఏడు నెలల గర్భిణి.. పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో.. దారుణ నిర్ణయం!

Hyderabad Crime News: ఇటీవల జనాలు ప్రతి చిన్న విషయానికి అలగడం, కోపం తెచ్చుకోవడం తీవ్ర మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. ఆ క్షణంలో తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Hyderabad Crime News: ఇటీవల జనాలు ప్రతి చిన్న విషయానికి అలగడం, కోపం తెచ్చుకోవడం తీవ్ర మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. ఆ క్షణంలో తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఏడు నెలల గర్భిణి.. పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో.. దారుణ నిర్ణయం!

ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పని ఒత్తిడి, జీవిత భాగస్వామితో విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాల వల్ల మానసిక ఇబ్బందలకు గురై క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నారు. కొన్నిసార్లు విచక్షణ కోల్పో ఎదుటి వారిపై దాడులు చేయడం, హత్యలకు పాల్పపడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. అన్యోన్యంగా సాగిపోతున్న సంసారం.. ఏడు నెలల గర్భం.. ఓ మహిళ తీసుకున్న దారుమైన నిర్ణయంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ రామాంతపూర్ కి చెందిన ఏడు నెలల గర్భిణి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాంతపూర్ కు చెందిన సాయి పవన్, అనూష (26) లకు 14 నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం అనూష ఏడు నెలల గర్భవతి. ఆదివారం 7 గంటల సమయంలో అనూష మా అత్తగారింటి నుంచి నేను వెళ్లిపోతున్నా అంటూ తండ్రికి మెసేజ్ చేసింది. వెంటనే ఆమె తండ్రి అల్లుడు సాయి పవన్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అవును మీ కూతురు కనిపించడం లేదు.. వెతుకుతున్నాం అంటూ సమాధానం చెప్పాడు పవన్.

ఈ క్రమంలోనే అనూష తల్లిదండ్రులు రామంతపూర్ వచ్చి బంధువులు, స్నేహితుల ఇండ్లలో వాకబు చేశారు. చుట్టు పక్కల ఎంత వెతికినా అనూష జాడ తెలియరాలేదు.శనివారం రోజు అనూష తన తండ్రికి ఫోన్ చేసి అమ్మాను నిన్ను చూడాలని ఉంది. మా అమ్మగారి ఇంటికి వెళ్తా అంటే అత్తగారు వద్దని అంటున్నారు. నా మనసు అస్సలు బాగా లేదు నాన్న అంటూ కన్నీరు పెట్టుకొని అలిగి ఎటో వెళ్లిపోయిందని అనూష తండ్రి వెంకటేశ్వర్లు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి