iDreamPost

తగ్గినట్టే తగ్గి మళ్లీ షాక్.. ఈ రోజు పసడి ధరలు ఎంతంటే?

Gold and Silver Rates: ఇటీవల పసిడి, వెండి ధరలకు ఎప్పుడు తగ్గుతున్నాయో.. ఎప్పుడు పెరుగుతున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Gold and Silver Rates: ఇటీవల పసిడి, వెండి ధరలకు ఎప్పుడు తగ్గుతున్నాయో.. ఎప్పుడు పెరుగుతున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.

తగ్గినట్టే తగ్గి మళ్లీ షాక్.. ఈ రోజు పసడి ధరలు ఎంతంటే?

దేశంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. అందుకే బంగారంకి ఉన్నంత విలువ దేనికీ ఉండదు. బంగారం ఆభరణాలుగానే కాకుండా ఇప్పుడు ఒక ఇన్వెస్ట్ మెంట్ గా చూస్తున్నారు. బంగారం పై పెట్టుబడి పెడితే భవిష్యత్ లో అంతకు పదింతలు లాభం వచ్చే అవకాశం ఉందని సామాన్యులు భావిస్తున్నారు. అందుకే ఈ మధ్య పసిడి కొనుగోలు గతంలో కన్నా ఎక్కువ అయ్యింది. దీంతో పసిడికి డిమాండ్ కూడా అదే రేంజ్‌లో పెరిగిపోయింది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్ ల జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపడం వల్ల తరుచూ హెచ్చుతగ్గులు అవుతున్నాయి. మార్కెట్ లో ఈ రోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం, వెండి ధరల్లో నిరంతరం మార్పులు జరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 5 వేల వరకు పెరిగింది. రాబోయే రోజుల్లో పసిడి తులం లక్ష దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మళ్లీ శుభ ముహుర్తాలు రాబోతున్నాయి.. పసిడి, వెండి కొనుగోలు మరింత పెరిగే అవకాశం ఉంది. గత వారం రోజులుగా పసిడి ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి. కానీ మహిళలకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. ఈ రోజు (జూన్5) పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.10 పెరిగింది. రూ.66,810 లకు చేరింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.10 పెరిగింది. రూ.72,880 లకు చేరింది.

today gold rates

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,960 లకు చేరింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.73,590 లకు చేరింది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు‌లో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,810 లకు చేరింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.72,880 లకు చేరింది. చెన్నైలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.67,460 లకు చేరింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.73,590 లకు చేరింది. కిలో వెండి పై రూ.100 పెరిగింది. నేడు మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 98,600 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి