iDreamPost
android-app
ios-app

తగ్గినట్టే తగ్గి.. మళ్లీ షాక్ ఇచ్చిన పసిడి.. ఈ రోజు ధర ఎంతంటే?

  • Published May 30, 2024 | 8:46 AM Updated Updated May 30, 2024 | 8:46 AM

Gold and Silver Rates: అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు నిరంతరం పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపించడం వల్ల ధరల్లో మార్పులు జరుగుతున్నాయి.

Gold and Silver Rates: అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు నిరంతరం పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపించడం వల్ల ధరల్లో మార్పులు జరుగుతున్నాయి.

తగ్గినట్టే తగ్గి.. మళ్లీ షాక్ ఇచ్చిన పసిడి.. ఈ రోజు ధర ఎంతంటే?

బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.దేశంలో మహిళలు ప్రతి పండుగ, శుభకార్యాలకు పసిడి కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల పసిడి ధరలు తరుచూ తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల ప్రభావం పసిడి, వెండిపై పడటం వల్ల ధరల్లో మార్పులు జరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. గత నెలలో పసిడి ధరలు చుక్కలు చూపించాయి.. ఈ నెలలో కాస్త ఊరటనిస్తూ వచ్చాయి. మొన్నటి వరకు పసిడి ధరలు తగ్గుతూ వచ్చినా.. మళ్లీ షాక్ ఇస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి రూ.80 వేల నాటికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ రోజు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలో కొంత కాలంగా పసిడి, వెండి ధరలు నిరంతరంగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తుంది. బంగారం కొని దాచుకుంటే భవిష్యత్ లో భారీ రేటు పలుకుతుందని మధ్యతరగతి కుటుంబికులు భావిస్తున్నారు. అందుకే బంగారం పై ఇన్వెస్ట్ పెట్టేందుకు ఉత్సాహపడుతున్నారు. అంతేకాదు బంగారం ఆపద సమయంలో వెంటనే ఆదుకుంటుంది. దీంతో దేశంలో పసిడి కొనుగోలు భారీగా పెరిగుతుంది.. దాంతో పాటే డిమాండ్ కూడా పెరుగుతుంది. నేటి ఉదయానికి ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,260 కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.420 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360 వద్ద ట్రెండ్ అవుతుంది.

today gold rate

దేశ ఆర్థిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,110 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,210 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,760 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,920 వద్ద ట్రెండ్ అవుతుంది. కోల్‌కొతా, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,110 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,210 వద్ద ట్రెండ్ అవుతుంది.తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,110 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,210 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి పై రూ.100 పెరిగింది. ఢిల్లీతో పాటు ముంబై,బెంగుళూరు, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ. 97,800 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రలతో పాటు చెన్నై లో కిలో వెండి ధర రూ. 1,02,300 వద్ద ట్రెండ్ అవుతుంది.