iDreamPost
android-app
ios-app

అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీకి షాక్! కోటి జరిమానా విధించిన SEBI

  • Published Sep 23, 2024 | 9:37 PM Updated Updated Sep 23, 2024 | 9:37 PM

SEBI: అన్మోల్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కోటి రూపాయల జరిమానా వేసింది

SEBI: అన్మోల్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కోటి రూపాయల జరిమానా వేసింది

అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీకి షాక్! కోటి జరిమానా విధించిన SEBI

అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. అతనిపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ).. ఏకంగా కోటి రూపాయల జరిమానా వేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ లో లోన్ ఇచ్చే విషయంలో అన్మోల్ తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. రూల్స్ పాటించలేదు. అందుకే సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సెబీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ విషయం కార్పొరేట్ లోన్ కి సంబంధించినది. ఈ విషయంలో సరైన విచారణ జరగలేదు. ఈ కేసులో కంపెనీ చీఫ్ రిస్క్ ఆఫీసర్ కృష్ణన్ గోపాలకృష్ణన్‌ కి కూడా సెబీ షాక్ ఇచ్చింది. అతనిపై 15 లక్షల జరిమానా కూడా విధించింది.

అన్మోల్ అంబానీ, గోపాలకృష్ణన్‌ ఇద్దరూ 45 రోజుల్లోగా జరిమానాను చెల్లించాలని ఉంటుందని సెబీ హెచ్చరించింది. ఈ విషయం తన ఉత్తర్వుల్లో పెర్పెర్కోంది. సోమవారం నాడు సెబీ వీరిపై ఈ చర్య తీసుకుంది. అలాగే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో అనిల్ అంబానీకి కూడా గట్టి ఇచ్చింది సెబీ. ఇంకా ఆయనతో పాటు మరో 24 మందికి కూడా షాక్ ఇచ్చి నిషేధించింది. వారిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించింది. సెబీ ఆగస్టు నెలలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా అంతేకాకుండా అనిల్ అంబానికి అయితే ఏకంగా రూ.25 కోట్ల భారీ జరిమానాని కూడా సెబీ విధించింది.

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ డైరెక్టర్ల బోర్డులో ఉన్న అన్మోల్ అంబానీ సాధారణ ప్రయోజన కార్పొరేట్ లోన్ లేదా జిపిసిఎల్ లోన్ అప్రూవ్ చేసారని తన ఉత్తర్వులో తెలిపింది సెబీ. అది కూడా కంపెనీ డైరెక్టర్ల బోర్డు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పుడు అలాంటి లోన్ అప్రూవ్ చేయకూడదు. కానీ ఆయన అప్రూవ్ చేశారు. గతంలో 2019లో ఫిబ్రవరీ 14న అకురా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 20 కోట్ల లోన్ ని అన్మోల్ అంబానీ అప్రూవ్ చేశారు. అయితే ఫిబ్రవరి 11, 2019న జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు తరువాత జీపీసీఎల్ లోన్ ఇవ్వకూడదని జారీ చేసింది. ఇక లోన్స్ ఇచ్చే విషయంలో రూల్స్ పాటించనందుకు సెబీ అంబానీలపై వేసిన జరిమానా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.