iDreamPost
android-app
ios-app

వెలుగులోకి వస్తున్న హర్ష సాయి దారుణాలు.. అంతా దాని కోసమేనా?

  • Published Sep 25, 2024 | 3:35 PM Updated Updated Sep 27, 2024 | 2:28 PM

Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయి పేరు ప్రస్తుతం నెట్టింట మారు మోగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ యువతిపై అత్యాచారం చేసిన ఆరోపణలకు గాను ఆయనపై నార్సింగ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివవాదంలో బాధిత యువతి విషయంలో హర్ష సాయి పాల్పడిన దారుణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయి పేరు ప్రస్తుతం నెట్టింట మారు మోగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ యువతిపై అత్యాచారం చేసిన ఆరోపణలకు గాను ఆయనపై నార్సింగ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివవాదంలో బాధిత యువతి విషయంలో హర్ష సాయి పాల్పడిన దారుణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

  • Published Sep 25, 2024 | 3:35 PMUpdated Sep 27, 2024 | 2:28 PM
వెలుగులోకి వస్తున్న హర్ష సాయి దారుణాలు.. అంతా దాని కోసమేనా?

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పేరు ప్రస్తుతం నెట్టింట మారు మోగిపోతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. ఇటీవలే హర్షసాయి ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసి, ఆమె వద్ద రూ.2 కోట్లు తీసుకొని మోసం చేశాడని ఆమె ఆరోపణలు చేసింది. అంతేకాకుండా..  పలుమార్లు ఆ యువతి పై  అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా.. ఆమె న*గ్న వీడియోలు, ఫోటోలను సీక్రెట్ గా రికార్డు చేశాడని, పైగా ఆ వీడియోలను, ఫోటోలను అడ్డు పెట్టుకొని ఆమెను మానసికంగా వేధించడని బాధితరాలు మంగళవారం రాత్రి నార్సింగ్ పోలీసు స్టేషన్ లో అతని పై ఫిర్యాదు చేసింది. ఇక హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది.

దీంతో బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నార్సింగ్ పోలీసులు యూట్యూబర్ హర్ష సాయిపై 376(2), 376ఎన్, 354 సెక్షన్ల కింద రేప్ కేసు పెట్టారు. అయితే తాజాగా ఈ వివాదం స్పందించిన హర్ష సాయి ఇదాంత డబ్బు కోసమేనని త్వరలోనే నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే హర్షసాయి తరుపు అడ్వకేట్ చిరంజీవి కూడా హర్ష సాయి పై కావాలనే కుట్ర పన్నుతున్నారని అతడు అమాయకుడు అని పేర్కొన్నారు. కానీ, తాజాగా ఈ వివాదం పై బాధితురాలి తరుపు లాయర్ నాగూర్ బాబు ఓ మీడియా కథనాలతో మాట్లాడుతూ.. హర్ష సాయి చేసిన దారుణాలను బయటపెట్టారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా హర్ష సాయి బాధితురాలి లాయర్ నాగూర్ బాబు ఈ కేసుకు సంబంధించి ఓ మీడియా కథనాల్లో పలు సంచలన నిజాలు బయటపెట్టారు. ఈ సందర్భంగా లాయర్ నాగూర్ బాబు మాట్లాడుతూ.. ‘బాధిత యువతి యూట్యూబర్ హర్ష సాయి హీరోగా నిర్మిస్తున్న మెగా సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ మొదటిగా.. 2022 లోని ఓ సాంగ్ కోసం కలుసుకున్నారు. ఆ సమయంలో తనకు మంచి ఫేమ్ ఉంది. తన వద్ద ఒక స్టోరీ ఉంది అని హర్ష బాధితురాలికి చెప్పాడు. ఇక తన స్టోరీని సినిమా రూపంలో తీస్తే పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మబలికాడు. అలా బాధితురాలు హర్ష సాయి సొంతంగా డైరెక్ట్ చేస్తున్న మెగా మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. ఇకపోతే హర్షసాయి మూవీ షూటు కోసం హైదరాబాద్ లో ఉండాలంటే తనకు షల్టర్ లేదని బాధితురాలితో చెప్పాడు. దీంతో బాధితురాలు హర్ష సాయి కోసం ఒక విల్లాను కూడా అరేంజ్ చేసింది.

ఈ క్రమంలోనే.. స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అప్పుడప్పుడు విల్లాకు రావాల్సి ఉంటుదని హర్ష సాయి బాధితురాలికి చెప్పాడు. ఇక అతని మాటలు నమ్మిన బాధిత యువతి తరుచు హర్ష సాయి విల్లాకు మూవీ స్క్రిప్ట్ కోసం వెళ్లేది. ఆ సమయంలోనే హర్ష సాయి తనకు మత్తు మందు ఇచ్చి, ఆమె సృహలో లేనప్పడు ఆమెపై లైంగీక దాడికి పాల్పడ్డాని, పైగా అదంతా వీడియో, ఫోటోస్ లో తీశాడని ఆయన పేర్కొన్నారు. అలాగే మరుసటి రోజు ఆ వీడియో రీకార్డ్సును చూపించి ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో అప్పుడే హర్ష సాయిపై బాధిత యువతి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నదని, కానీ ఆ సమయంలో హర్ష సాయి వాళ్ళ నాన్న రాధాకృష్ణ ఈ వివాదంలో ఎంటరయ్యి, మీడియాకు వెళ్తే.. ఇద్దరి ఫేం నాశనం అవుతాయని సర్ది చెప్పాడని తెలిపారు. అంతేకాకుండా.. హర్ష సాయిని బాధిత యవతిని పెళ్లి చేసుకోవాలని తండ్రి ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఇక అది నమ్మిన బాధితురాలు కేస్ ఫైల్ చేయకుండా గతంలో విత్‌ డ్రా చేసుకుంది,.

ఇకపోతే హర్ష సాయి నటిస్తున్న మెగా మూవీ 2023లో ట్రైలర్ రిలీజైంది. అయితే ఆ ట్రైలర్ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కూడా అందుకుంది. ఇక హర్ష సాయి టీజర్ రిలీజ్ కు ముందే బాధితరాలిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. అప్పటి నుంచి పెళ్లి గురించి ప్రస్తావన తీసుకు రావడం జరిగింది. ఆ సమయంలో..  అయింది. అయితే హర్ష సాయి ఎలాగైనా ఆమెతో ఉన్న కాపీరైట్స్ దక్కించుకోవడానికి మరోసారి వీడియోలు చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. అంతేకాకుండా.. ఆమె చేసిన పర్సనల్ కాల్స్ ఎడిట్ చేసి హర్షకు అనుకూలంగా మార్చుకొని అవి చూపించి ఆమెను బెదిరించాడు. బాధితురాలిని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేశాడు. దీంతో హర్ష సాయి పెట్టె వేధింపులు తట్టుకోలేక చివరకు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కచ్చితంగా కోర్టులో హర్షసాయికి పడుతుందనే నమ్మకం ఉందని’ లాయర్ నాగూర్ బాబు పేర్కొన్నారు. మరి, హర్ష సాయి బాధిత యువతి విషయంలో చేసిన దారుణలై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş