iDreamPost
android-app
ios-app

Tollywood: తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలిని కలిసిన కోస్టారిక దేశ అధికార ప్రతినిధి!

  • Published Sep 25, 2024 | 7:13 PM Updated Updated Sep 25, 2024 | 7:13 PM

Tollywood: కోస్టారిక దేశ అధికార ప్రతినిధి సోఫియా.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ దాము, నిర్మాతల మండలి సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సత్యనారాయణ వంటి ప్రముఖులని కలిశారు.

Tollywood: కోస్టారిక దేశ అధికార ప్రతినిధి సోఫియా.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ దాము, నిర్మాతల మండలి సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సత్యనారాయణ వంటి ప్రముఖులని కలిశారు.

  • Published Sep 25, 2024 | 7:13 PMUpdated Sep 25, 2024 | 7:13 PM
Tollywood: తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలిని కలిసిన కోస్టారిక దేశ అధికార ప్రతినిధి!

కోస్టారిక దేశ అధికార ప్రతినిధి సోఫియా.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ దాము, నిర్మాతల మండలి సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సత్యనారాయణ వంటి ప్రముఖులని కలిశారు. ఆమె వారితో కోస్టారిక దేశంలో షూటింగులకు గల అవకాశాలని వివరించారు. అనుమతులన్ని సింగిల్ విండో విధానంలో ఇస్తామని, పన్ను రాయితీలు కల్పిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి నిర్మాతలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వారిని కలిసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని తెలియచేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలి తరపున నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, రామ్ సత్యనారాయణ సోఫియాని సన్మానించారు. ఫ్యూజీ సాఫ్ట్వేర్ మనోహర్ రెడ్డి గారు, పలువురు నిర్మాతలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

సోఫియా సలాస్ విషయానికి వస్తే.. ఆమె అంతర్జాతీయ సహకారంలో అనుభవం ఉన్న కోస్టారికన్ లాయర్. ఆమె యూనివర్శిటీ ఆఫ్ కోస్టా రిక నుండి లా డిగ్రీని, యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ (UK) నుండి మానవ హక్కుల ఇంటర్ డిసిప్లినరీ మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె ఎన్నో రకాల సమస్యలపై అంతర్జాతీయ UN సంస్థలతో హానికర పరిస్థితుల్లో వలసదారులు పురోగతిని వేగవంతం చేశారు. ఇంకా చాలా దేశాలకు మద్దతు ఇవ్వడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGs) సాధన దిశగా 10 ఏళ్ళకు పైగా స్థానికంగా, అంతర్జాతీయంగా పనిచేశారు. విదేశీ వ్యవహారాల, మంత్రిత్వ శాఖతో కోస్టారికా రాయబార కార్యాలయంలో మంత్రి సలహాదారుగా, కాన్సుల్ జనరల్‌గా పనిచేశారు. ఆమె అక్టోబర్ 2021లో న్యూ ఢిల్లీలోని కోస్టారికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఇంకా కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా సోఫియా సలాస్ మాట్లాడుతూ.. “తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దాము గారిని, తెలుగు ఫిలిం నిర్మాతలు మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ గారిని, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు గారు, రామ్ సత్యనారాయణ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మోహన్ ముళ్ళపూడి గారితో ఎప్పటినుంచో ట్రావెల్ చేస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించి తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా సహకరిస్తున్న మోహన్ ముళ్ళపూడి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉన్న దేశాలన్నిటిలో మా దేశం కూడా చాలా అందమైనది. సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకి పర్మిషన్లు ఇస్తాము. నిర్మాతలు కోస్టారిక దేశంలో షూటింగ్ చేయాలనుకునేవారు తెలుగు ఫిలిం ఛాంబర్ వారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అని” ఆమె అన్నారు. మరి ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet