iDreamPost
android-app
ios-app

Maha Lakshmi: బెంగళూర్ మహాలక్ష్మీ హత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన నిజాలు!

  • Published Sep 25, 2024 | 5:00 PM Updated Updated Sep 25, 2024 | 5:00 PM

Bangalore: ప్రస్తుతం మహాలక్ష్మి (29) హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెని దారుణంగా హత్య చేశారు.

Bangalore: ప్రస్తుతం మహాలక్ష్మి (29) హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెని దారుణంగా హత్య చేశారు.

Maha Lakshmi: బెంగళూర్ మహాలక్ష్మీ హత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన నిజాలు!

ప్రస్తుతం మహాలక్ష్మి (29) అనే యువతి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెని అతి దారుణంగా హత్య చేశారు. ఆమెని చంపడమే కాకుండా 52 ముక్కలుగా నరికి ఆమె శరీర భాగాలను ప్రిజ్లో పెట్టారు. బెంగళూరులో ఈ హత్య జరిగింది. ఆమె ఇంట్లో నుంచి విపరీతమైన దర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు సంబంధించిన విచారణ చేపట్టారు. ఈ ఘటన అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఆమె తలను దారుణంగా మూడు ముక్కలుగా నరికాడని పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన మరో శ్రద్ధావాకర్ హత్యను తలపించేలా భయనికి గురి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది.

ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక విషయాలు బయట పడుతున్నాయి. గతంలో మహాలక్ష్మి మల్లేశ్వరంలోని ఓ బట్టల షాపులో పని చేసేది. ఆ షాపులో ఓ వ్యక్తి ఆమెకు పరిచయం కావడంతో వారి పరిచయం కాస్త ప్రేమగా మారిందని, ఆ వ్యక్తే హత్య చేసి ఉంటాడని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా మహాలక్ష్మితో పనిచేసే సహోద్యోగి పేరు కూడా బలంగా వినిపిస్తుంది. అతని పేరు ‘ముక్తి’ అని పోలీసులు విచారణలో తెలిసింది. ఇక ఈ హత్యలో ఇతనే ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. మహాలక్ష్మీ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం ముక్తికి నచ్చక ఆమెను
వ్యతిరేకించినట్లు పోలీసుల విచారణ ద్వారా సమాచారం తెలుస్తుంది. అయితే ఆమె సన్నిహితంగా ఉన్న వ్యక్తి మాత్రం ఎవరనేది ఇంకా తెలియలేదు.

అయితే ఈ కేసులో మహాలక్ష్మీకి హేమంత్ దాస్ అనే వ్యక్తితో అప్పటికే పెళ్లి అయిపోయింది. వీరికి ఓ పాప కూడా ఉంది. మహాలక్ష్మి భర్త హేమంత్ దాస్ ఆమె హత్యకు ‘అష్రాఫ్’ అనే వ్యక్తి కారణమని ఆరోపణలు చేశాడు. ఆమెకు, అష్రాఫ్‌తో అక్రమ సంబంధం ఉందని హేమంత్ చెప్పాడు. అయితే ఈ కేసులో అసలు నిందితుడు ఒడిశాకు చెందినవాడని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పశ్చిమ బెంగాల్-ఒడిశా సరిహద్దుల్లో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, స్పష్టంగా నిందితుడు ఎక్కడ ఉన్నాడనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ కేసు గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.