iDreamPost
android-app
ios-app

Harsha Sai: హర్ష కేసులో మరో ట్విస్ట్.. బయట పడ్డ వీడియో.. వెలుగులోకి సంచలన విషయం?

  • Published Sep 25, 2024 | 4:34 PM Updated Updated Sep 25, 2024 | 6:02 PM

Harsha Sai: హర్ష సాయి అందరకి సుపరిచితమే. యూ ట్యూబ్ ద్వారా సెన్సేషన్ అయ్యారు. 'మెగా' సినిమాతో హీరోగా లాంచ్ కావడానికి సిద్ధమవుతున్న హర్ష కొంత కాలం నుంచి వివాదాల్లో నిలుస్తున్నాడు.

Harsha Sai: హర్ష సాయి అందరకి సుపరిచితమే. యూ ట్యూబ్ ద్వారా సెన్సేషన్ అయ్యారు. 'మెగా' సినిమాతో హీరోగా లాంచ్ కావడానికి సిద్ధమవుతున్న హర్ష కొంత కాలం నుంచి వివాదాల్లో నిలుస్తున్నాడు.

Harsha Sai: హర్ష కేసులో మరో ట్విస్ట్.. బయట పడ్డ వీడియో.. వెలుగులోకి సంచలన విషయం?

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి అందరకి సుపరిచితమే. యూ ట్యూబ్ ద్వారా సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారు. తక్కువ టైమ్ లోనే బాగా ఫేమస్ అయ్యాడు. ‘మెగా’ అనే సినిమాతో హీరోగా లాంచ్ కావడానికి సిద్ధమవుతున్న హర్ష గత కొంత కాలం నుంచి వివాదాల్లో నిలుస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడానే వివాదంలో హర్ష సాయి ఆరోపణలు ఎదురుకున్నాడు. ఇప్పుడు తాజాగా చీటింగ్ కేసు వివాదంలో ఆరోపణలు ఎదురుకుంటున్నాడు. ఈ కేసు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్ష సాయి మోసం చేశాడని ఆరోపణలు చేసింది. హర్ష సాయిపై నార్సింగీ పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది.

కేవలం హర్ష సాయి మీద మాత్రమే కాకుండా అతని తండ్రిపై కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తనని పెళ్లి చేసుకుంటానని హర్ష సాయి మోసం చేయాడమే కాకుండా తన నుంచి హర్ష ఏకంగా రూ. 2కోట్లు తీసుకొని తనను మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక తనపై నమోదైన రేప్ కేసుపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించిన సంగతి తెలిసిందే. అవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టుపారేశాడు. డబ్బు కోసమే ఇలా చేస్తున్నారని, త్వరలోనే నిజం బయటకు వస్తుందని తన గురించి తనని అభిమానించే వారికి తెలుసని అన్నాడు. ఇవన్నీ తన తరపున ఉన్న న్యాయవాది చూసుకుంటారని క్లారిటీ ఇచ్చాడు హర్ష సాయి. అయితే ఈ కేసు గురించి ఒక్కో ట్విస్ట్ బయట పడుతుంది.

ఇప్పటికే హర్ష బాధితురాలితో మాట్లాడిన ఫోన్ కాల్ ను బయట పెట్టాడు. హర్ష దాదాపు 17నిమిషాలకు పైగా ఆమెతో వాట్సాప్ కాల్ మాట్లాడాడు. అయితే హర్ష సాయి తాను మాట్లాడిన వాట్సాప్ కాల్ ఆడియోను మరో ఫోన్ తో రికార్డు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఆ ఆడియోలో బాధితురాలు ఎక్కువగా మాట్లాడిన పార్ట్ ను మాత్రమే హర్ష విడుదల చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఇంకో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ బాధితురాలితో హర్ష సాయి కలిసి ఉన్న సీసీ టీవీ విజువల్ ఒకటి బయటకి వచ్చి చక్కర్లు కొడుతుంది. అయితే ఆ వీడియోలో వారేదో విషయం గురించి గొడవ పడుతున్నట్లు కనిపిస్తుంది. ఆ అమ్మాయి వెళ్లిపోతుంటే హర్ష ఆమెని వెనక్కి పిలిచి తన ఫోన్లో ఏదో చూపిస్తున్న దృశ్యం కనపడుతుంది. అయితే ఆ విజువల్స్ లో హర్ష ఆ అమ్మాయికి న్యూడ్ వీడియోలు చూపిస్తూ బెదిరించినట్లు బాధితురాలి సన్నిహితుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆ వీడియోలో వారి మధ్య ఏం జరిగిందో?, వారేమి మాట్లాడుకుంటున్నారో? ఇంకా తెలియాల్సి ఉంది. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

 

 

 

 

 

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş