Vinay Kola
Top 10 bikes: ఇండియాలో ఎక్కువగా సేల్ అవుతున్న టాప్ 10 బైకులలో హీరో స్ప్లెండర్ ప్లస్ నెంబర్ వన్ గా నిలిచింది. ఇది ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో రారాజుగా దూసుకుపోతుంది.
Top 10 bikes: ఇండియాలో ఎక్కువగా సేల్ అవుతున్న టాప్ 10 బైకులలో హీరో స్ప్లెండర్ ప్లస్ నెంబర్ వన్ గా నిలిచింది. ఇది ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో రారాజుగా దూసుకుపోతుంది.
Vinay Kola
ఇండియాలో ఎక్కువగా సేల్ అవుతున్న టాప్ 10 బైకులలో మధ్యతరగతి ప్రజల ఫేవరేట్ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్ నెంబర్ వన్ గా నిలిచింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో రారాజుగా దూసుకుపోతుంది. హీరో స్ప్లెండర్ గత నెలలో ఏకంగా 3,02,234 యూనిట్ల సేల్స్ ని నమోదు చేసింది. గత ఏడాది ఆగస్టు 2023లో హరో స్ప్లెండర్ మొత్తం 2,89,930 యూనిట్లు సేల్ చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్ప్లెండర్ అమ్మకాలలో 4.49 శాతం వృద్ధిని సాధించింది. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ. 74,155 ఉంటుంది. ఈ లిస్టులో హోండా యాక్టివా రెండో స్థానంలో నిలిచింది. హోండా యాక్టివా గత నెలలో 5.86 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 2,27,458 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఈ స్కూటీ ఎక్స్ షోరూం ధర రూ. 78,376 ఉంటుంది. ఈ లిస్టులో హోండా షైన్ మూడో స్థానంలో నిలిచింది. ఈమధ్య కాలంలో హోండా షైన్ వార్షికంగా 31.15 శాతం పెరుగుదలతో మొత్తం 1,49,697 యూనిట్ల సేల్స్ ని నమోదు చేసుకుంది. దీని ఎక్స్ షోరూం ధర 81,119 ఉంటుంది.
ఇక బజాజ్ పల్సర్ ఈ లిస్టులో నాల్గవ స్థానంలో ఉంది. బజాజ్ పల్సర్ గత నెలలో 28.19 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 1,16,250 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. దీని ధర రూ. 85,861 ఉంటుంది. టీవీఎస్ జూపిటర్ ఐదో స్థానంలో ఉంది. TVS జూపిటర్ గత నెలలో 27.49 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 89,327 యూనిట్ల సేల్స్ ని నమోదు చేసుకుంది. దీని ధర రూ. 77,199. ఈ లిస్టులో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఆరో స్థానంలో నిలిచింది. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ గత నెలలో 15.89 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 84,660 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. దీని ధర రూ.56,308 ఉంటుంది. ఇక సుజుకి యాక్సెస్ ఏడవ స్థానంలో ఉంది. సుజుకి యాక్సెస్ గత నెలలో 16.37 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 62,433 యూనిట్ల అమ్మకాలు జరుపుకుంది. దీని ధర రూ. 82,196
TVS XL సేల్స్ లో ఎనిమిదో స్థానంలో ఉంది. TVS XL గత నెలలో 22.06 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 44,546 యూనిట్ల అమ్మకాలు జరుపుకుంది. దీని ధర రూ. 44,129. ఇక బజాజ్ ప్లాటినా తొమ్మిదో స్థానంలో నిలిచింది. బజాజ్ ప్లాటినా గత నెలలో వార్షికంగా 3 శాతం పెరుగుదలతో మొత్తం 41,915 యూనిట్ల ద్విచక్ర వాహనాల అమ్మకాలనీ నమోదు చేసింది. దీని ధర రూ. 66,837. ఇక హోండా డియో పదో స్థానంలో నిలిచింది. ఈ హోండా డియో వార్షికంగా 19.83 శాతం పెరుగుదలతో మొత్తం 34,705 యూనిట్ల ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరుపుకుంది. దీని ధర రూ.74,474 ఉంటుంది. మరి ఈ టాప్ 10 మోస్ట్ సెల్లింగ్ బైక్స్ పై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.