iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు SBI బంపరాఫర్.. రూ. 7.5 లక్షల స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్!

SBI Asha Scholarship 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ అందిస్తోంది. ఏకంగా 7.5 లక్షల స్కాలర్ షిప్ పొందే ఛాన్స్ ను కల్పిస్తోంది. మీరూ అప్లై చేసుకోండి.

SBI Asha Scholarship 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ అందిస్తోంది. ఏకంగా 7.5 లక్షల స్కాలర్ షిప్ పొందే ఛాన్స్ ను కల్పిస్తోంది. మీరూ అప్లై చేసుకోండి.

విద్యార్థులకు SBI బంపరాఫర్.. రూ. 7.5 లక్షల స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్!

ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేది చదువు మాత్రమే. పేదరికాన్ని పారద్రోలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చేది చదువు ఒక్కటే. చదువుకుంటేనే వారి కుటుంబాలు కూడా ఉన్నత స్థితికి చేరుకుంటాయి. కానీ చదువుకునేందుకు డబ్బు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో పిల్లల చదువుకు అయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు నిత్యావరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే మరో వైపు పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారంగా మారాయి. పిల్లల్లో చదివే ప్రతిభ ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక సమస్యలు వారికి అడ్డంకిగా మారుతున్నాయి. డబ్బులేని కారణంగా ఎంతో మంది చదువులకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బంది పడే విద్యార్థులకు ఎస్బీఐ శుభవార్తను అందించింది. ఎస్బీఐ ఆశా స్కాలర్‌షిప్ ద్వారా విద్యార్థులకు రూ. 7.5 లక్షల స్కాలర్ షిప్ ను అందించేందుకు ముందుకొచ్చింది. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో విద్యార్థుల కోసం అనేక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లను చేపడుతోంది. విద్యార్థుల కోసం ఎస్బీఐ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆరో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. పాఠశాల విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఐఐటీ, ఐఐఎం వంటి విద్యా సంస్థల్లో చదువుతున్న వారు ఈ స్కాలర్ షిప్ పొందొచ్చు. నిబంధనల ప్రకారం రూ.15 వేల నుంచి రూ.7.5 లక్షల వరకూ స్కాలర్ షిప్ అందజేస్తారు. ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు ఆఖరి తేదీ అక్టోబర్ 01 2024. మరి ఈ స్కాలర్ షిప్ కు ఎవరు అర్హులు? నిబంధనలు ఏంటి? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎస్బీఐ ఆశా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి విద్యార్థి యొక్క మునుపటి సంవత్సరం మార్క్ షీట్, ఆధార్ కార్డ్, ప్రస్తుత సంవత్సరం పాఠశాల ఫీజు చెల్లింపు రుజువు, విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల బ్యాంక్ వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యార్థి పాస్‌పోర్ట్ సైజు ఫోటో. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించిన తర్వాత, దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి. SBI యొక్క ఆశా స్కాలర్‌షిప్ 2024 కోసం దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 01, 2024 అని గుర్తుంచుకోవడం ముఖ్యం. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఎంపిక ప్రక్రియ:

  • ఈ స్కాలర్ షిప్స్ కు విద్యార్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్థి చదువు, ఆర్థిక అవసరాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తుది ఎంపిక కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎంపికైన తర్వాత, స్కాలర్‌షిప్ మొత్తం నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు.

పాఠశాల విద్యార్థులు:

అర్హతలు:

  • 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • మునుపటి తరగతి చివరి పరీక్షలో కనీసం 75% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
  • విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా 3,00,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
  • దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • బాలికల కోసం 50 శాతం స్లాట్లు రిజర్వ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇస్తారు.
  • ఎంపికైన విద్యార్థికి రూ.15వేలు స్కాలర్ షిప్ అందజేస్తారు.

యూజీ విద్యార్థులు:

  • దేశంలోని ప్రీమియర్ విశ్వవిద్యాలయాలు / కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించే విద్యార్థులు అర్హులు. గత ఏడాది 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలు మించకూడదు. ఎంపికైన విద్యార్థులకు రూ.50 వేలు స్కాలర్ షిప్ అందిస్తారు.

పీజీ విద్యార్థులు:

  • దేశంలోని విశ్వవిద్యాలయాలు/కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులు అర్హులు. ముందు ఏడాది 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలు మించకూడదు. ఎంపికైన విద్యార్థులకు రూ. 70 వేల స్కాలర్ షిప్ అందిస్తారు.

ఐఐటీ విద్యార్థులు:

  • దేశంలోని ఏదైనా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించే విద్యార్థులు అర్హులు. ముందు ఏడాది 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలు మించకూడదు. ఎంపికైన విద్యార్థులు రూ.2 లక్షల స్కాలర్ షిప్ పొందవచ్చు.

ఐఐఎం విద్యార్థులు:

  • దేశంలోని ఏదైనా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) నుంచి ఎంబీఏ/పీజీడీఎం కోర్సులు అభ్యసించే విద్యార్థులు దీనికి అర్హులు. ముందు ఏడాది 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలు మించకూడదు. ఎంపికైన విద్యార్థులు రూ. 7.50 లక్షల వరకూ పొందవచ్చు.