iDreamPost

నిన్న మొన్నటి వరకు పరుగులు పెట్టిన పసిడి.. ఒక్కసారే..

Gold and Silver Rates: బంగారం అంటే ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వస్తున్నాయి.

Gold and Silver Rates: బంగారం అంటే ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వస్తున్నాయి.

నిన్న మొన్నటి వరకు పరుగులు పెట్టిన పసిడి.. ఒక్కసారే..

దేశంలో కొంతకాలంగా పసిడి, వెండి ధరలు తగ్గేదే లే అన్నట్లు పెరిగిపోతూ వస్తున్నాయి.ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండి కొనుగోలు బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పసిడి ధరలు బాగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే పరిణామాలు బంగారం, వెండి పై ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మరోవైపు డాలర్ హెచ్చుతగ్గులు, వడ్డీ రేట్లలో స్వల్ప మార్పులు చేర్పుల వల్ల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. మొన్నటి వరకు పరుగులు పెట్టిన బంగారం ధర నేడు కాస్త ఊరటనిస్తుంది. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

పసిడి కొనుగోలు చేయలనుకునేవారికి కాస్త ఊరటనిచ్చే వార్త. ఇటీవల వరుసగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వస్తున్నాయి. బంగారం ఆభరణాలు గానే కాకుండా ఆపద సమయంలో పెట్టుబడిగా పనికి వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో పసిడికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. నిన్నటి వరకు చుక్కలు చూపిస్తూ వచ్చిన బంగారం ధరలకు నేడు కాస్త బ్రేక్ పడింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి రూ.74,120 కి చేరింది, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.67,940 కి చేరింది.హైదరాబాద్,వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,940 ఉండగా,24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములు రూ.74,120 వద్ద కొనసాగుతుంది. మరోవైపు కిలో వెండి పై రూ.100 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.89,900 కి చేరింది. ఢిల్లీ, ముంబై, కొల్‌కొతాలో కిలో వెండి ధర రూ.86,400 వద్ద కొనసాగుతుంది.

today gold rate

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,270 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,940 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.74,120 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,940 వద్ద కొనసాగుతుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి