iDreamPost

నిన్నటి వరకు పరుగులు పెట్టిన పసిడికి బ్రేక్.. ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates: గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు రోజు పెరిగిపోతూ సామాన్యులకు పెను భారంగా మారాయి. కొన్నిసార్లు ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఆ సమయంలో పసిడి కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.

Gold and Silver Rates: గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు రోజు పెరిగిపోతూ సామాన్యులకు పెను భారంగా మారాయి. కొన్నిసార్లు ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఆ సమయంలో పసిడి కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.

నిన్నటి వరకు పరుగులు పెట్టిన పసిడికి బ్రేక్.. ఈ రోజు ధర ఎంతంటే?

దేశంలో పసిడి ప్రతిరోజూ పరుగులు పెడుతూనే ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండి కొనుగోలు విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు పసిడి, వెండి పై భారీగా పడుతుంద ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే డాలర్ విలువ హెచ్చుతగ్గులు, వడ్డీ రేట్లలో స్వల్ప మార్పులు చేర్పుల వల్ల బంగారం ధరలు తరుచూ పెరగడం, తగ్గడం జరుగుతుంది. మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం నిన్న, నేడు కాస్త ఊరటనిస్తుంది. నిన్న రూ.700 మేర తగ్గిన తులం బంగారం ధర నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. వెండి ధర సైతం నిన్న రూ.1000 తగ్గగా.. నేడు స్థిరంగా ఉంది. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశంలో పసిడి, వెండి ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూ కొనుగోలుదారులకు బెంబెలెత్తిస్తున్నాయి. డిమాండ్ కి తగ్గట్టు ధరలు అన్నట్లు పసిడి కొనుగోలు ఎక్కువ కావడంతో ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పదిహేను రోజుల్లో ఒకటీ రెండు రోజులు కాస్త తగ్గు ముఖం పట్టినా మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. అయితే బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. నేడు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇదే బంగారం కొనుగోలు చేయడానికి మంచి సమయం అంటున్నారు నిపుణులు. నిన్న రూ.700 తగ్గిన 22 క్యారెట్ గోల్డ్ నేడు స్థిరంగా కొనసాగుతుంది. కిలో వెండి పై రూ.1000 వరకు తగ్గి స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్,వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650 ఉండగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములు రూ.72,700 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ.89,000 వద్ద కొనసాగుతుంది.

today gold rates

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,700 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,500 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.72,550. వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,960 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.86,250, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.84,900 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.88,400లు ఉండగా, ఢిల్లీ లో రూ.85,600 వద్ద ట్రెండ్ అవుతుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి