iDreamPost
android-app
ios-app

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే!

Gold and Silver Rates: బంగారం ధరలు నిత్యం పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. గత ఏడాది పసిడి ధరలు ఆకాశాన్నంటాయి.. కొత్త ఏడాది సందర్భంగా భారీగా తగ్గుముఖం పట్టాయి.

Gold and Silver Rates: బంగారం ధరలు నిత్యం పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. గత ఏడాది పసిడి ధరలు ఆకాశాన్నంటాయి.. కొత్త ఏడాది సందర్భంగా భారీగా తగ్గుముఖం పట్టాయి.

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే!

దేశంలో ఇటీవల బంగారం వాడకం బాగా పెరిగిపోయింది. ప్రపంచంలో అత్యంత విలువైన వాటిలో బంగారం ఒకటి. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సొసైటీలో బంగారం గొప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తుంటారు మహిళలు. పండుగలు, పెళ్లిళ్ళు.. ఇతర శుభకార్యాలకు మహిళలు బంగారు ఆభరణాలు కొనేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే జ్యులరీ షాపుల్లో ఎన్నో వెరైటీల బంగారు ఆభరణాలు లభిస్తున్నాయి. గత ఏడాది బంగారం ధరలు చుక్కలు చూపించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు బంగారంపై ప్రభావం చూపిస్తుంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కొత్త ఏడాదికి బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇటీవల బంగారం, వెండి ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి. మూడు నెలల క్రితం పసిడి, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. కొత్త ఏడాది వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం అంటున్నారు నిపుణులు. ధరలు ఏ క్షణంలో అయినా పెరగవొచ్చు.. తగ్గినపుడు, స్థిరంగా ఉన్నపుడు తీసుకుంటే బెటర్ అని కొనుగోలుదారులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో నేటి పసిడి ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57, 700 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 62, 950 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి కిలో రూ.500 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 77,500 వద్ద ట్రెండ్ అవుతుంది.

today gold rates

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,850 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,100 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, కోల్ కొతా, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57, 700 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 62, 950 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 63,490 వద్ద కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర చెన్నై, కేరళాలో రూ.77,500లు ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్ కొతాలో కిలో వెండి ధర రూ. 76,000, బెంగుళూరు లో కిలో వెండి ధర రూ. 73,500 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి