iDreamPost

గుడ్ న్యూస్.. త‌గ్గిన బంగారం వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎంతంటే?

కొత్త ఏడాది పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త అనొచ్చు.. వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడమే కాదు.. స్థిరంగా కొనసాగుతున్నాయి.

కొత్త ఏడాది పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త అనొచ్చు.. వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడమే కాదు.. స్థిరంగా కొనసాగుతున్నాయి.

గుడ్ న్యూస్.. త‌గ్గిన బంగారం వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎంతంటే?

దేశంలో రోజు రోజుకీ బంగారం కొనుగోలు ఎక్కువే అవుతుంది. బంగారం ఆభరణాలు అంటే ఆడవారు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత రెండు నెలలుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వచ్చాయి. దీంతో కొత్త ఏడాది కూడా బంగారం చుక్కలు చూపిస్తుందని భావించారు. కానీ పసిడి ధరలు దారుణంగా పడిపోతూ వస్తున్నాయి. గత ఏడాది 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.64 వేలు దాటింది. దీంతో కొనుగోలుదారులు బంగారం కొనాలంటే బెంబేలెత్తిపోయారు. కానీ వారం రోజు నుంచి పసిడి ధరలు స్థిరంగా కొనసాగడం శుభపరిణామం అనే చెప్పాలి. కొత్త ఏడాది ఆరంభం నుంచి బంగారం ధరలు దిగిరావడంతో సామాన్యులు కొనుగోళ్ల బాట పట్టారు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరల విషయానికి వస్తే..

బంగారం కొనుగోలు చేసేవారికి గొప్ప శుభవార్త. గత వారం రోజులుగా పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పులు బంగారంపై ప్రభావం చూపించడం వల్ల ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు మహిళలు జ్యులరీ షాపుల్లో లేటెస్ట్ ఆర్నమెంట్స్ ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశంలో బంగారానికి విపరీతమైన క్రేజ్ తో పాటు డిమాండ్ కూడా పెరిగింది. బంగారం పై ఇన్వెస్ట్ చేస్తే.. భవిష్యత్ లో ఎంతో ఉపయోగపడుతందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,050 వద్ద ట్రెండ్ అవుతుంది.

today gold rates

దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,950 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,200 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 58,300 వద్ద ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,600 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబై తో పాటు కోల్‌కతా, బెంగళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, పుణె, కిలో వెండి ధర రూ. 76,400 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో రూ.73,500, తెలుగు రాష్ట్రాలతో సహా కేరళ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,800 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి