iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ పడిపోయిన బంగారం ధర..!

  • Published May 14, 2024 | 9:16 AMUpdated May 14, 2024 | 9:16 AM

అక్షయ తృతీయ సందర్భంగా .. ఇప్పుడు పసిడికి గిరాకీ పెరగడంతో ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలామంది బంగారం ధరలు అమాంతం పెరగడంతో దానిని కొనుగోలు చేయడంలో వెనకడుగు వేశారు. అయితే, అలాంటి వారందరికీ ఇప్పుడు ఓ మంచి శుభవార్త అందింది.

అక్షయ తృతీయ సందర్భంగా .. ఇప్పుడు పసిడికి గిరాకీ పెరగడంతో ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలామంది బంగారం ధరలు అమాంతం పెరగడంతో దానిని కొనుగోలు చేయడంలో వెనకడుగు వేశారు. అయితే, అలాంటి వారందరికీ ఇప్పుడు ఓ మంచి శుభవార్త అందింది.

  • Published May 14, 2024 | 9:16 AMUpdated May 14, 2024 | 9:16 AM
పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ పడిపోయిన బంగారం ధర..!

ప్రస్తుత కాలంలో బంగారం అంటే ఇష్టపడని వారంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ముఖ్యంగా మహిళల గురించైతే ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల డిజైన్లతో చేసే బంగారు అభరణాలను ధరించేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. కానీ, ఈ మధ్యకాలంలో బంగారం లు పసిడి  ప్రియులకు భారీగా షాకిస్తున్నాయి. ముఖ్యంగా శుభకార్యాల సీజన్ కావడంతో.. దేశ వ్యాప్తంగా జ్యూలరీ షాపులకు బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య ఘణనీయంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే బంగారానికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అంతేకాకుండా.. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల ప్రభావం బంగారంపై పడుతుంది. ఈ క్రమంలోనే తరుచూ మార్కెట్ లో పసిడి, వెండి ధరల్లో మార్పులు జరుగుతున్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఓ శుభవార్త అందింది. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా పడిపోతున్నాయి. అలాగే వెండి రేటు సైతం భారీగానే దిగివచ్చింది. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్‌ లో బంగారం, వెండి రేట్లు ఎంతున్నాయో తెలుసుకుందాం.

అక్షయ తృతీయ సందర్భంగా .. ఇప్పుడు పసిడికి గిరాకీ పెరగడంతో ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలామంది బంగారం ధరలు అమాంతం పెరగడంతో దానిని కొనుగోలు చేయడంలో వెనకడుగు వేశారు. అయితే, అలాంటి వారందరికీ ఇప్పుడు ఓ మంచి  అవకాశం లభించింది. అదేమిటంటే.. అక్షయ తృతీయ మరుసటి రోజు నుంచి బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. దీంతో వరుసగా పసిడి రేట్లు కూడా తగ్గుతునే ఉన్నాయి. కాగా, తులం బంగారం రేటు దాదాపు రూ.500 దిగివచ్చింది. అలాగే కిలో వెండి రేటు రూ. 1200 మేర పడిపోయింది. అలాగే ప్రస్తుతం శుభముర‍్తాలు పెళ్లిళ్లు, ప్రత్యేక రోజులు సైతం లేవు. దీంతో బంగారం ధరలు దిగివస్తున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

today gold rates

 అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు రికార్డ్ గరిష్ఠాల్లోనే ట్రేడింగ్ అవుతుండడం మళ్లీ దేశీయంగా ధరలు పెరిగేందుకు కారణం కావచ్చని చెబుతున్నారు. అందుకే ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిది. ఈ క్రమంలోనే.. నేడు అనగా మే 14వ తేదీ  మంగళవారం రోజున హైదరాబాద్ లో తులం ప్యూర్ గోల్డ్ రేటు ఎంతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు ఇవాళ 2337 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 28.30 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అయితే ఇండియన్ రూపాయి మారకం విలువ కాస్త పుంజుకుంది. డాలర్ తో పోలిస్తే ప్రస్తుతం రూ. 83.510 వద్ద అమ్ముడవుతోంది. అయితే హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల ఆభరణ తయారీ బంగారం రేటు 10 గ్రాములకు రూ. 100 మేర తగ్గి రూ. 67 వేల 150 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ.110 తగ్గి రూ. 73 వేల 250 వద్దకుదిగివచ్చింది. అలాగే బంగారంతో పోటీ పడుతూ వెండి సైతం భారీగానే తగ్గుతోంది. గత మూడు రోజుల్లో కిలో వెండి రేటు రూ.1200 మేర పడిపోయింది. ఇవాళ కిలో వెండి రేటు రూ.500 తగ్గి హైదరాబాద్ లో కిలోకు రూ. 86 వేల 500 పలుకుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి