Arjun Suravaram
Arjun Suravaram
చాలా ప్రమాదాలు ఎప్పుడు, ఎలా వస్తాయో ఎవరికి తెలియదు. ఈ క్రమంలో రెప్పపాటులో ఘోరం జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. అయితే కొన్ని ప్రమాదాలను మాత్రం కొందరు కావాల్సి ఆహ్వానిస్తారు. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలనే కోల్పోయిన ఘటనలు ఎన్నో జరిగాయి. ముఖ్యంగా రైలు పట్టాలు దాటే క్రమంలో నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే కొందరు మాత్రం రెప్పపాటులో మృత్యుకోరల్లో నుంచి తప్పించుకుని చిరంజీవి అయ్యారు. తాజాగా ఓ మహిళ విషయంలో కూడా అచ్చం అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్నాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని యలహంక స్టేషన్ పరిధిలోని రాజానుకుంటే సమీపంలో ఓ మహిళకు తృటిలో పెను ప్రమాదం తప్పించుకుంది. యలహంక ప్రాంతంలో నివాసం ఉండే ఓ మహిళ పని మీద బయటకుక వెళ్లింది. ఈ క్రమంలో సదరు మహిళ రాజానుకుంట రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో వేగంగా ఓ గూడ్స్ రైలు దూసుకొస్తుంది. అందరూ కూడా ఆమెను చూసి.. ఘోరం జరిగిపోయిందని ఫిక్స్ అయిపోయారు. మరోవైపు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఆమె ఉంది. అలానే ఆమె మెదడు మొద్దు పారిపోయింది. రైలు ఇక తన వద్దకు వచ్చేస్తున్న తరుణంలో క్షణాల్లో పట్టాలపై ముడుచుకుని పడుకుంది.
రైలు వెళ్లి అనంతరం లేచి ప్రాణాలను దక్కించుకుంది. సరైన సమయంలో ఆ మహిళ పట్టాల మధ్యలో పడుకోవడంతో బండి ఢీ కొట్టకుండా తప్పించుకున్నారని యలహంక రైల్వే పోలీసులు తెలిపారు. రైలు వెళ్లిపోయాక… అక్కడున్న ఆమె కుమార్తె అమ్మను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. అక్కడే ఉన్న ప్రయాణికులు కూడా ఒక్క క్షణం పాటు షాక్ లో ఉండి పోయారు. ఆమె ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వివాహేతర సంబంధం! రక్తపు మడుగులో మహిళ..