iDreamPost

ఎలుకను బైక్‌తో తొక్కించి చంపిన వ్యక్తి.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

ఎలుకను బైక్‌తో తొక్కించి చంపిన వ్యక్తి.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

భూమిపై ఉండే ప్రతి జీవి ప్రాణం ఎంతో విలువైనది. ఏ జీవిని చంపే హక్కు మరో జీవికి లేదు. అయితే మనిషి మాత్రం.. నోరులోని మూగ జీవాలపై  తన వికృత క్రీడను ప్రదర్శిస్తుంటాడు.  నేటి సమాజంలో జంతువులను ప్రేమించే వాళ్లు ఒక వైపు ఉంటే వాటిని హింసించే వాళ్లు కూడా  ఉన్నారు. అయితే మూగ జీవాలను చంపుతే ఎవరు అడిగే వారులేరు అనుకునే వారికి పోలీసులు అదిరిపోయే షాకిస్తుంటారు. తాజాగా ఎలుకును బైక్ తో  తొక్కించి చంపిన వ్యక్తికి పోలీసులు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఉత్తర్ ప్రదేశ్ లోని నొయిడా ప్రాంతంలో ఉండే ‘ఖాన్ బిర్యానీ’ సెంటర్ యజమాని మతాలుబ్ అహ్మద్ కుమారుడు జైనులుద్దీన్‌..తన బైక్ తో ఎలుకను తొక్కించి అతి క్రూరంగా చంపేశాడు. అతడు చేసిన ఆ ఘోర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ చిన్న ఎలుకపైకి పదే పదే బైక్ ఎక్కించి, తన ప్రతాపం చూపించాడు. అత్యంత దారుణంగా ఆ ఎలుక నుజ్జు నుజ్జు అయ్యేలా చేసి.. చంపేశాడు. ఈ ఘటనపై  నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మూగ జీవిపై ఇంత కర్కశత్వమా? అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఈ దారుణానికి పాల్పడిన నిందితుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కూడా స్పందించారు.

మరోవైపు ఎక్కడ తనను పోలీసులు పట్టుకుంటారోనని నిందితుడు  జైనులుద్దీన్ నోయిడా నుంచి పరారయ్యాడు. చివరకు యూపీలో అతడి స్వగ్రామమైన మాముర అనే ఊరిలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని అరెస్ట్ చేసిన ఫోటోలను పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఎలుకను హింసించి చంపినందుకు తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. నిందితుడి అరెస్ట్ కూడా వైరల్ అయింది. ఎలుకను చంపినందుకు అతడిని అరెస్ట్ చేయలేదని పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఇలా మూగజీవాలను హింసించే  వారికి ఎలాంటి శిక్షలు వేయాలి?.మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండివీడియో : ఈ ‘పిల్లి’ తెలివి చూస్తే మతి పోతుంది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి