iDreamPost
android-app
ios-app

ఆవును చంపిందని పగతో… రెండు ప్రాణాలు బలి తీసుకున్న రైతు!

ఆవును చంపిందని పగతో… రెండు ప్రాణాలు బలి తీసుకున్న రైతు!

చాలామందికి  మూగ జీవాలు  అంటే ఎంతో ప్రాణం. వాటిని తమ బిడ్డలా చూసుకుంటారు. వాటికి ఏ చిన్న కష్టం వచ్చిన కూడా భరించలేరు. మరికొందరు అయితే వాటికి ఎవరైన హానీ చేస్తే.. వారిపై పగ తీర్చుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి కూడా తన ఆవును చంపిందనే కోపంతో ఓ పులిని చంపాలనుకున్నాడు. చివరకు విషయం పెట్టి.. రెండు పులులను బలి తీసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో రెండు పులుల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులు అక్కడి చేరుకున్నారు. పులులను పరిశీలీంచి.. వాటికి ఎవరో విషమిచ్చి చంపారని నిర్ధారించుకున్నారు. పులుల మృత కళేబరాలకు సమీపంలోనే మరో ఆవు చచ్చి పడుంది. మూడు కళేబరాల నమూనాలను ఫోరెన్సిక్‌ విశ్లేషణ కోసం కోయంబత్తూరుకు పంపారు. ఆ మృత కళేబరాల్లో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్టు నివేదిక వచ్చింది. విషపూరితమైన ఆవు మృత కళేబరాన్ని తినడం వల్లే పులులు చనిపోయినట్టు తేలింది.

ఈ క్రమంలోనే ఓ రైతును అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  అతడిని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆవు యజమాని శేఖర్  చెప్పిన విషయాలకు అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పది రోజుల కిందట తన ఆవును పులి చంపినట్లు శేఖర్‌ తెలిపాడు. పులిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లు తెలిపాడు. అందుకు పక్క ప్లాన్ వేసి.. సగం తిని వదిలిన ఆవు మృత కళేబరానికి పురుగుమందులు పూసి విషపూరితం  చేశాడు. మరుసటి రోజు ఆవును తిన్న పులులు మృత్యువాతపడ్డాయి. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişcasibom