iDreamPost
android-app
ios-app

మిద్దెపై పడుకున్న భర్త.. లేపేందుకు వెళ్లిన భార్యకు షాక్!

  • Published Jul 15, 2023 | 8:03 PM Updated Updated Jul 15, 2023 | 8:03 PM
  • Published Jul 15, 2023 | 8:03 PMUpdated Jul 15, 2023 | 8:03 PM
మిద్దెపై పడుకున్న భర్త.. లేపేందుకు వెళ్లిన భార్యకు షాక్!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో హత్యలు, ఆత్మహత్యలు  చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వివిధ కారణాలతో జరుగుతున్న హత్యల సంఖ్య బాగా పెరిగిపోయింది. వివిధ కారణాలతో పగలు పెంచుకుని హత్యలు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కత్తులతో నరికి చంపే ఘటనలు అనేక జరుగుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇంటి మిద్దెపై నిద్రిస్తున్న యువకుడిని గొంతుకోసి హత్య చేశారు.  ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజాము సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

వైఎస్సాఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కానపల్లె ఎస్సీ కాలనీకి చెందిన నాగేంద్రబాబు(27), ఇమాంబిలు భార్యాభర్తలు. నాగేంద్ర బాబుకు ప్రొద్దుటూరు పట్టణం శ్రీనివాస నగర్ కు చెందిన ఇమాంబితో మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వారికి మూడేళ్ల కూమార్తె, ఏడాది కుమారుడు ఉన్నారు. గతంలో ఎర్రగుంట్లలో సింకుల తయారీ పనులు చేసేవాడు. అయితే నాగేంద్ర కొన్ని రోజులుగా గ్రానైట్‌ పనులకు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అదేవిధంగా నాగేంద్ర భార్య ఇంటి వద్దే చిల్లర దుకాణం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం పని ముగించుకుని రాత్రి నాగేంద్ర ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి వచ్చిన కాసేపటికి నాగేంద్రకు ఫోన్‌ కాల్‌ వచ్చింది.

దీంతో అతడు మళ్లీ  ఇంటి నుంచి  బయటకు వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి సమయంలో వచ్చి అదే గ్రామంలోని ఉన్న సోదరి ఇంటి మిద్దెపై పడుకున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతని గొంతు కోసి హత్య చేశారు.  తెల్లవారుజామున నిద్రలేపేందుకు భార్య వెళ్లింది. ఇమాంబి భర్త రక్తపు మడుగులో ఉండటంతో గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న బంధువులు, చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.  స్థానికులు ఇచ్చిన సమచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అయితే నాగేంద్ర హత్యకు కారణాలు ఏంటనేది తెలియరాలేదు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: నా స్నేహితుడితో పడుకో అంటూ భార్యను టార్చర్ పెట్టిన భర్త!

Jojobet GirişJojobetAnkara EscortGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetmeritbetcasibomiptv satın alCasibomcasibom