iDreamPost
android-app
ios-app

ప్రియుడి మోజులో.. భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య!

ప్రియుడి మోజులో..  భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య!

నేటికాలంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాల సంఖ్య బాగా  పెరిగిపోయింది. పరాయి వారి మోజులో పడి.. భాగస్వామిని అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. పది నిమిషా పరాయి వారితో పడక సుఖం కోసం ఎన్నో ఘోరాలకు పాల్పడుతున్నారు. మానవ సంబంధాల కంటే.. అక్రమ సంబంధాలే కావాలి అన్నట్లు ఉంది కొందరి వ్యవహారం. ఇంకా దారుణం ఏమిటంటే.. ప్రియుడి మోజులో పడి భర్తలను చంపిన మహిళలు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ మహిళ అంతకు మించి అన్నట్లు భర్తను చంపడమే కాకుండా ముక్కలు ముక్కలుగా చేసి.. కాల్వలో పడేసింది. ఈ ఘోరమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

ఉత్తర్ ప్రదేశ్ లోని  ఫీలిభిత్ జిల్లాలోని శివ్ నగర్ లో రాంపాల్(55), దులారో దేవి  అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సోన్ పాల్ అనే కుమారుడు ఉన్నారు.  ఇక రాంపాల్ స్థానికంగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చాలా కాలం పాటు రాంపాల్, దులారో దేవి  ఎంతో సంతోషంగా గడిపారు. అయితే  అంతా హాయిగా సాగిపోతున్న సమయంలో దులారో దేవి బుద్ధి వక్రమార్గంలోకి వెళ్లింది.  వారి ఇంటికి సమీపంలో ఉండే  రాంపాల్ స్నేహితుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

చివరకు అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో ఇద్దరు చాలా సార్లు రాంపాల్ కు తెలియకుండా వారి చీకటి పనులు కొనసాగించారు. అలానే ఇద్దరు నెల రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు. సరిగ్గా నెల రోజుల తరువాత ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ క్రమంలోనే సోమవారం దులారో దేవి భర్త రాంపాల్  అదృశ్యమయ్యాడు. చుట్ట పక్కల ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికిన ఫలితం లేక పోయింది. దీంతో ఆమె కుమారుడు సోన్ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రాం పాల్ ఇంటికి చేరుకుని అతడి భార్య, కుమారుల నుంచి సమాచారం సేకరించాడు. రాంపాల్ భార్యపై అనుమానం రావడంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు నిజం బయట పడింది.

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసింది. సోమవారం అర్ధరాత్రి  రాంపాల్ నిద్రిస్తుండగా గొడ్డలితో నరికి చంపింది. అనంతరం అతడి  శరీరాన్ని ఐదు ముక్కలుగా చేసి సమీపంలోని కాలువలో పడేసింది. శరీర భాగాలు పడేసిన ప్రదేశానికి గురువారం ఆమెను తీసుకెళ్లి.. వాటిని వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు.  ఈ ఘటనతో స్థానికంగా భయానక వాతావరణం ఏర్పడింది. పరాయి వాడి మోజులో పడి కట్టుకున్న భర్తనే ఇంత దారుణంగా హత్య చేస్తారా? అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు, ఆమె ప్రియుడికి కఠిన శిక్ష విధించాలని కోరారు. మరి.. ఇలాంటి దారుణలకు పాల్పడుతున్న వారికి ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రేమ అని నమ్మిన విద్యాశ్రీ జీవితం విషాదాంతం!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet