iDreamPost
android-app
ios-app

సగం కాలిన శవాన్ని తిన్న మందుబాబులు.. భయాందోళనలో ప్రజలు!

సగం కాలిన శవాన్ని తిన్న మందుబాబులు.. భయాందోళనలో ప్రజలు!

ఆదిమానవుల కాలంలో మనుషుల్లోని కొన్ని జాతుల వారు నరమాసం తిని  జీవించే వారని, కొంత కాలం తర్వాత అలాంటి జాతులు అంతరించి పోయాయని  మనం విన్నాం. అయితే మనిషి మాంసం ఎలా తింటారబ్బా! అనే సందేహం వస్తుంది. అసలు అలాంటి విషయాల గురించి అనుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. కానీ అటువంటి ఒళ్లు గగ్గురు పొడిచే దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తే ఇకా ఎలా ఉంటుంది. పై ప్రాణాలు పైనే పోతాయి కదూ..సరిగ్గా అటువంటి సంఘటనకే గురయ్యారు ఒడిశాలోనిలోని ఓ గ్రామస్థులు.  సంగం కాలిన ఓ యువతి శవాన్ని ఇద్దరు వ్యక్తులు పీకు తిన్నారు. ఘోరమైన ఘటన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఒడిశా రాష్ట్రంలోని మయూరిభంజ్ జిల్లా జమున్ బందసాహి గ్రామానికి చెందిన మధుస్మిత సింగ్ అనే 25 ఏళ్ల యువతి  అనారోగ్య కారణంగా  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. యువతి మృతితో ఆ కుటుంబ విషాదంలో మునిగిపోయింది. బాధను దిగమింగుకుని ఆమె మృతదేహాన్ని స్వగ్రామైన  బందసాహిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. యువతి శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి చితిపై పెట్టి మంట పెట్టారు.  ఇక చితిపై శవం కాలుతుండగా మందు తాగి ఇద్దరు వ్యక్తులు అక్కడి వచ్చారు. మంటల్లో కాలుతున్న శవాన్ని బయటకు తీసి.. మూడు ముక్కలు చేశారు. రెండు భాగాలను తిరిగి మంటల్లో వేసి.. మిగిలిన దానిని ఆ ఇద్దరు కలిసి తిన్నారు.  ఈ హఠాత్పరిణామంతో మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు భయందోళనకు గురయ్యారు.

కాసేపటి తేరుకుని నిందితలిద్దరిని పట్టుకుని దేహా శుద్ధి చేశారు. అంతేకాక స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితులు సుందర్ మోహన్ సింగ్(25), నరేంద్ర సింగ్(25) దంతుని  అనే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వారిద్దరు మద్యం మత్తులోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వారు చెప్పిన సమాధానాలకు పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. పెళ్లి కానీ యువతలు సగం కాలిన శరీరాన్ని తింటే.. తమకు అధ్బుతమైన శక్తులు వస్తాయని నిందితులు తెలిపారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిద్దరిపై  పోలీసులు కేసు నమోదు చేశారు. మరి.. ఒళ్లు గగ్గుర్లు పుట్టించే ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: మహిళ హత్య.. శరీర భాగాలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి..!