iDreamPost

9వ తరగతి అమ్మాయితో ప్రేమ.. లవర్ రక్తపు మడుగుల్లో!

  • Published Feb 10, 2024 | 5:36 PMUpdated Feb 10, 2024 | 5:43 PM

ఈ మధ్యకాలంలో ప్రేమోన్మాదుల చేస్తున్నా దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తాజాాగా ఓ ప్రేమోన్మాది ఘాతానికి మైనర్ బాలిక బలైంది. అసలేం జరిగిదంటే..

ఈ మధ్యకాలంలో ప్రేమోన్మాదుల చేస్తున్నా దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తాజాాగా ఓ ప్రేమోన్మాది ఘాతానికి మైనర్ బాలిక బలైంది. అసలేం జరిగిదంటే..

  • Published Feb 10, 2024 | 5:36 PMUpdated Feb 10, 2024 | 5:43 PM
9వ తరగతి అమ్మాయితో ప్రేమ.. లవర్ రక్తపు మడుగుల్లో!

దేశంలో రోజురోజుకి ప్రేమోన్మాదుల అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వీటి పై ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ప్రయోజనం లేకుండా పోతుంది. రాను రాను వీరి వేధింపులు.. మహిళలు, యువతిల పై కాకుండా.. చివరికి మైనర్ బాలికలను కూడా విడిచిపెట్టాడం లేదు. ప్రేమించనంటూ వెంటపడటం, వేధించండం, అత్యాచారం చేయడం వంటి దుర్మర్గలకు పాల్పపడుతున్నారు. అసలు అడపిల్లను ఒంటరిగా బయటకు పంపించాలంటే బయపడే దుస్థితి నెలకొంది. తరుచుగా ఏదో ఒక దాడులు, ఘోరాలనేవి అడవారి పై జరుగుతునే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది ఘాతానికి 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక బలైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రేమిస్తున్నంటూ ఓ యువకుడు 9వ తరగతి బాలికను గతకొంతకాలంగా వెంటపడి వేధించేవాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగాని, ఆ యువకుడు బాలికను హత్య చేసి తాను కూడా గొంతుకోసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన తాలూకాలోని దొమ్మలూరు గ్రామం వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథన ప్రకారం.. లక్కూరు ఫిర్కా సొసగెరె గ్రామ పంచాయతీ పరిధిలోని దొమ్ములూరులో.. దళిత వర్గానికి చెందిన మంజునాథ్, భారతి దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, పెద్ద కుమార్తె 10వ తరగతి చదవి ఇంట్లో ఉంది. ఇక రెండో కుమార్తె నందిత(15) లక్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే నిత్యం పాఠశాలకు గ్రామం నుంచి నడిచి వెళ్తుండేది. అయితే.. తాలూకాలోని హెచ్. హోసకోటె గ్రామ పంచాయతీ పరిధిలోని బరగూరు గ్రామానికి చెందిన నితిన్ బెంగళూరులో బీబీఎంపీలో దినకూలి నౌకరుగా పనిచేస్తూ.. ఈ గ్రామం నుంచి రాకపోకలు చేసేవాడు.

ఈ క్రమంలోనే నితిన్ కు.. నందిత పై కన్నేసి ప్రేమించాలని వెంటపడి వేధించేవాడు. కానీ, ఈ నేపథ్యంలోనే ఈనెల 7వ తేదిన పాఠశాలకు వెళ్లిన నందిత.. తిరిగి ఇంటికి రాలేదు. కాగా, అదే రోజు మధ్యాహ్నం నితిన్ గొంతు కోసుకుని రక్తపు మడుగులో ఇంటి వద్ద కనిపించగా.. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని కోలారులోని ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మరోవైపు నందిత తల్లిదండ్రులు మాలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నందిత కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ సమయంలోనే దొమ్మలూరు బాణారహళ్లి రోడ్డులోని నీలగిరి తోపులో ఓ బాలిక మృతదేహం పడి ఉందని గొర్రెల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు సంఘటన స్థాలానికి వెళ్లి పరిశీలించగా ఆ మృతదేహం నందితగా గుర్తించారు. పైగా మృతదేహం పై గాయాలు ఉండగా, కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. దీంతో బాలిక హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ ఘటన జరిగిన స్థలం బెంగళూరు రూరల్ జిల్లా హోసకోటె తాలూకా అనుగొండనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో అక్కడ పోలీసులు వచ్చి పరిశీలించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బెంగుళూరు వైదేహి ఆస్పత్రికి తరలించారు. అలాగే శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, నందితను హత్యచేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని డీఎస్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే బాలిక తల్లిదండ్రలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక సంఘటన స్థాలాన్ని తహసీల్దార్ కె. రమేష్, అదనపు ఎస్పీ రవిశంకర్, డీ ఎస్పీ ఎండీ నాగతి పరిశఈలించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి