iDreamPost

ఆడవారి జీవితాలతో ఆడుకునే వాళ్లకి ఓటు వేయకండి.. పూనమ్ కౌర్ సంచలన వీడియో

ఎప్పుడూ ఏదో అంశం మీద తన గళమెత్తే పూనమ్ కౌర్ ఈసారి కూడా మహిళల మీద జరిగిన అన్యాయం మీద మరోసారి తన గళమెత్తింది. ఆడవారి జీవితలతో ఆడుకునే వాళ్లకి ఓటు వేయకండి అంటూ సంచలన వీడియో ఒకటి విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఎప్పుడూ ఏదో అంశం మీద తన గళమెత్తే పూనమ్ కౌర్ ఈసారి కూడా మహిళల మీద జరిగిన అన్యాయం మీద మరోసారి తన గళమెత్తింది. ఆడవారి జీవితలతో ఆడుకునే వాళ్లకి ఓటు వేయకండి అంటూ సంచలన వీడియో ఒకటి విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఆడవారి జీవితాలతో ఆడుకునే వాళ్లకి ఓటు వేయకండి.. పూనమ్ కౌర్ సంచలన వీడియో

పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. దేశంలో పలు సమస్యల మీద ఆమె తన గొంతు వినిపిస్తూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో జరిగే వాటి మీదనే కాకుండా రాజకీయాల్లో జరిగే వాటి మీద కూడా ఆమె స్పందిస్తూ ఉంటుంది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లపై విమర్శలు చేయడం.. జగన్ పాలన బాగుందంటూ ప్రశంసించడం.. గీతాంజలి మృతిపై స్పందించడం ఇలా ఆమె బర్నింగ్ టాపిక్స్ ని పట్టుకుని వాటి మీద తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. అలాంటి వాళ్లకి ఓటేస్తారా? అంటూ ఓ సంచలన వీడియో ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ గురించి పూనమ్ కౌర్ సంచలన వీడియో విడుదల చేసింది. కర్ణాటకలో ‘సెక్యులర్ జనతాదళ్’ పార్టీకి చెందిన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ.. హాసన్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. కర్ణాటకలో జరిగిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో హాసన్ నియోజకవర్గం నుంచి ప్రజ్వల్ పోటీ చేశారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రజ్వల్ కి సంబంధించిన అసభ్యకర వీడియోలు బయటకు వచ్చాయి. ఏప్రిల్ 26న హాసన్ నియోజకవర్గంలో పోలింగ్ జరిగిన రోజు నుంచి ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మహిళను బెదిరించి లైంగికంగా వేధించడం, అసభ్యకర వీడియోలు తీయడంపై ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదు అయ్యింది. దీంతో ప్రజ్వల్ జర్మనీ పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ ఘటనపై నటి పూనమ్ కౌర్ స్పందించింది. 2800కి పైగా మహిళలను బెదిరించి లైంగిక వేధింపులకు గురి చేసి అసభ్యకర వీడియోలు తీసిన ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడని పూనమ్ కౌర్ వ్యాఖ్యానించింది. డబ్బు, పలుకుబడి ఉంది కాబట్టి ప్రభుత్వం అతన్ని ఏమీ చేయలేదని.. అందుకే ప్రజ్వల్ జర్మనీలో హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడని ఆమె పేర్కొంది. జనాలు అతని మీద తిరగబడనంత వరకూ అతనికి శిక్ష పడుతుందని చెప్పలేమని ఆమె వెల్లడించింది. అందుకే ఇలాంటి వాళ్లకి ఓట్లు వేయకండి అంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ఆరోపణలు, కేసులు ఉన్నవారికి ఓట్లు వేసి గెలిపించకండి.. మహిళలను శక్తులుగా పూజించే ఈ దేశంలో ఇలాంటి నీచులని గెలిపిద్దామా? అంటూ పూనమ్ కౌర్ ప్రశ్నించింది.

తప్పు చేసిన అతన్ని పట్టుకోలేని ఈ ప్రభుత్వం మనల్ని ఎలా కాపాడుతుంది. ఒకసారి ఆలోచించి ఓటు వేయండి.. ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి వేయండి అంటూ వేడుకుంది. ఈ ఎన్నికల్లో మహిళలకు రక్షణ కల్పించేవారికి ఓటు వేయండి.. ఇది అందరి కర్తవ్యం. అన్యాయం చేసేవారికి అధికారం ఇవ్వకండి అంటూ ఆమె వీడియోలో చెప్పుకొచ్చింది. మహిళలను బాధపెట్టేవారు రాజకీయాల్లో ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని.. ఈ ప్రజ్వల్ ని వదలద్దు. జంతువులు కూడా ఇలా చేయవు. మనం రామరాజ్యం వైపు వెళ్తున్నామా? లేక రావణ రాజ్యం వైపు వెళ్తున్నామా? అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి