iDreamPost

కర్ణాటకను కుదిపేస్తోన్న సె*క్స్‌ కుంభకోణం.. మాజీ పీఎం మనవడు, MPపై ఆరోపణలు.. పూర్తి వివరాలు

  • Published Apr 29, 2024 | 3:45 PMUpdated Apr 29, 2024 | 3:45 PM

Karnataka Obscene Videos Case: ఎన్నికల వేళ వెలుగు చూసిన సెక్స్‌ కుంభకోణం కర్ణాటకను కుదిపేస్తుంది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవన్న మీద లైంగిక వేధింపులు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..

Karnataka Obscene Videos Case: ఎన్నికల వేళ వెలుగు చూసిన సెక్స్‌ కుంభకోణం కర్ణాటకను కుదిపేస్తుంది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవన్న మీద లైంగిక వేధింపులు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..

  • Published Apr 29, 2024 | 3:45 PMUpdated Apr 29, 2024 | 3:45 PM
కర్ణాటకను కుదిపేస్తోన్న సె*క్స్‌ కుంభకోణం.. మాజీ పీఎం మనవడు, MPపై ఆరోపణలు.. పూర్తి వివరాలు

2024 పార్లమెంట్‌ ఎన్నికల వేళ.. కర్ణాటకను లైంగిక వేధింపుల ఆరోపణలు, వీడియోలు కుదిపేస్తున్నాయి. మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవేగౌడ మనవడు, హసన్‌ జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవన్నపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. అతడు తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించి అశ్లీల దృశ్యాల ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రేవన్నపై వచ్చిన ఆరోపణలతో బీజేపీ ఇరకాటంలో పడింది. కారణం.. ప్రస్తుతం కర్ణాటకలో కమలం పార్టీ.. జేడీఎస్‌తో పొత్తు కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ పార్టీ కీలక నేతపై ఇలాంటి ఆరోపణలు రావడంతో.. కాషాయ పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇక దీనిపై విచారించేందుకు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం సిట్‌ను నియమించింది.

ఎవరీ రేవన్న.. అసలేం జరిగిందంటే..

మాజీ ప్రధాని, జేడీఎస్​ నేత హెచ్​డీ దేవేగౌడ మనవడు, హెచ్​డీ రేవన్న కొడుకు ప్రజ్వల్‌ రేవన్న. ప్రస్తుతం ఆయన హసన్​​ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. 2024 లోక్​సభ ఎన్నికల రెండో దశలో భాగంగా.. ఆయన బరిలో దిగిన హసన్​ నియోజకవర్గంలో శుక్రవారం పోలింగ్​ జరిగింది. ఇక ఆరోపణల విషయానికి వస్తే.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు, ఫొటోల్లో.. ఎంపీ ప్రజ్వల్‌ రేవన్న ఓ మహిళపై లైంగిక దాడి జరుపుతున్న దృశ్యాలు ప్రచారం అవుతున్నాయి. ఇక బాధితురాలు ప్రజ్వల్​ రేవన్న ఇంట్లో పని చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదుతో.. రేవన్నపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. బాధితురాలు రేవన్నతో పాటు.. అతడి తండ్రి హెచ్​డీ రేవన్నపైనా ఆరోపణలు చేసింది.

ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. ‘‘హెచ్​డీ రేవన్న, ఆయన కుమారుడు ప్రజ్వల్​ రేవన్నలు.. తమ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందిపై లైంగిక దాడికి పాల్పడేవారు. వారిలో నేను కూడా ఉన్నాను. నేను ఉద్యోగంలో చేరిన నాలుగో నెలకు.. నన్ను ప్రజ్వల్​ రేవన్న తన క్వార్టర్స్​కి పిలిచి.. వేధింపులకు గురి చేశాడు. ఇక తన భార్య ఇంట్లో లేని సమయంలో రేవన్న మహిళా సిబ్బందిని స్టోర్​రూమ్​కి పిలిచేవాడు. పండ్లు ఇస్తున్నట్టు నటించి.. మమ్మల్ని ముట్టుకునేవాడు. మా చీరలకు పిన్నులు తీసేసి, లైంగిక దాడి చేసేవాడు. ఇంట్లో మొత్తం ఆరుగురు మహిళా సిబ్బంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని అక్కడ పని చేసే మగవాళ్లు మాకు చెప్పేవారు’’అని చెప్పుకొచ్చింది.

అంతేకాక ప్రజ్వల్​ రేవన్న.. వీడియో కాల్స్​లో తన కూతురితోనూ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు బాధితురాలు వెల్లడించింది. అతడు చాలాసార్లు తనకు వీడియో కాల్స్‌ చేసి అసభ్యంగా మాట్లాడటం వంటివి చేయడం చేశాడన‍్నది. ఒకవేళ కాల్‌ లిఫ్ట్‌ చేయకపోతే.. పదే పదే ఫోన్‌ చేసేవాడనకి.. దాంతో తన కుమార్తే.. ప్రజ్వల్​ రేవన్న నెంబర్​ని బ్లాక్​ చేసినట్టు వివరించింది. తనతో పాటు చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పుకొచ్చింది. కాగా.. బాధితురాలు.. ప్రజ్వల్​ రేవన్నకు బంధువని తెలుస్తోంది. ఆమె.. హెచ్​డీ రేవన్న భార్య భవానీ రేవన్నకు బంధువని సమాచారం.

దేశం విడిచి వెళ్లిన రేవన్న…

లైంగిక ఆరోపణల నేపథ్యంలో.. ఆదివారం ఉదయం ప్రజ్వల్​ రేవన్న ఇండియాని విడిచి.. జర్మనీ వెళ్లారు. దేశం విడిచి వెళ్లే ముందు ముందు ఆయన కూడా పోలీసు కేసు పెట్టారు. వీడియోలను మార్ఫ్​ చేసి, తనని ఇరికిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. ఇదంతా రాజకీయ కుట్ర అని, ప్రజ్వల్​ రేవన్న పేరును చెడగొట్టేందుకు, ఎన్నికల్లో ఓడించేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని.. బీజేపీ, జేడీఎస్​ ఎలక్షన్​ ఏజెంట్​ ఆరోపించారు.

ప్రజ్వల్​ రేవన్నపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణల మీద.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి స్పందించారు. ‘‘నేరం ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. కానీ సిట్​ బృందం దర్యాప్తు ముగిసేంతవరకు వేచి చూద్దాం. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఈ ఆరోపణలపై సిట్​ దర్యాప్తునకు ఆదేశించారు. ఒకవేళ.. ప్రజ్వల్​ రేవన్న దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే.. ఆయన్ని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత.. సిట్​ టీమ్​దే’’ అన్నారు. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ మౌనంగా ఉంది. ప్రజ్వల్​ రేవన్నకు సంబంధించిన అశ్లీల వీడియోలకు, తమకు సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి