iDreamPost

బాలికపై సామూహిక అత్యాచారయత్నం.. కాపాడిన హిజ్రా!

బాలికపై  సామూహిక అత్యాచారయత్నం.. కాపాడిన హిజ్రా!

నేటికాలంలో కూడా మహిళల మీద…ఎప్పుడూ.. ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా.. వావి వరసలు మరిచి అత్యాచారాలకు పాల్పడుతున్నారు.  కేవలం ఆడపిల్ల అయితే చాలు పసికందు నుంచి ముసలి ఆవిడ.. వరకు  ఎవర్న్ వదిలిపెట్టడం లేదు. మహిళలపై జరుగుతున్న మనుషులుగా మనల్ని ఆలోచనలో పడేస్తాయి. అంతేకాక మనుషులపై అసహ్యం కలిగించేలా చేస్తున్నాయి. ఇలాంటి దారుణ ఘటన ఒకటి హైద్రబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ ప్రాంతంలో కొందరు బాలికను కిడ్నాప్ చేశారు. అనంతరం సామూహికంగా అత్యాచారయత్నం చేశారు. అయితే ఆ  మానవ మృగాల నుంచి తప్పించుకునేందుకు సదరు బాలిక తీవ్రంగా పోరాటం చేసింది. అయినా ఆ మృగాలు బాలికను బంధించారు. చివరకు వారి నుంచి ఎలాగో అలాగా తప్పించుకుని  రోడ్డుపైకి చేరుకుంది. కాపాడండి అంటూ ఆ బాలిక పెద్ద పెట్టున కేకలు వేసింది.

దీంతో అటుగా వెళ్తున్న ఓ హిజ్రా ఆ బాలికను కాపాడింది.  అనంతరం హిజ్రా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలపాలైన ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెద్ద అంబర్ పేట్ కు చెందిన ఓ మైనర్ బాలికను.. ఆమె ఇంటి మందుకు వెళ్లిన కొందరు వ్యక్తులు.. అడ్రెస్ అడిగారు. ఆ వివరాలు ఫోన్ లో చూపిస్తున్నట్లు మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో ఆ బాలిక వెనకాల నుంచి వచ్చి.. నోరు గట్టిగా మూసేసి.. వారి వెంట తెచ్చుకున్న వాహనంలోకి ఎక్కించారు.

అనంతరం హాయత్ నగర్ వైపు ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాలకు తీసుకెళ్లి.. అత్యాచారయత్నం చేశారు. ఈ క్రమంలో దుండగుల నుంచి తప్పించుకున్న ఆ బాలిక రోడ్డుపైకి చేరుకుంది. ఆ బాలికను గమనించిన హిజ్రా..పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది కాపాడింది. ఈ ఘటనతో ఆడపిల్లల తల్లిందడ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష వేస్తే మరోసారి తప్పు చేయడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి