iDreamPost
android-app
ios-app

కుమారుడు పరీక్షలో ఫెయిలయ్యాడని తల్లి ఆత్మహత్య!

కుమారుడు పరీక్షలో ఫెయిలయ్యాడని తల్లి ఆత్మహత్య!

ప్రతి తల్లిదండ్రులు..తమ బిడ్డలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. బిడ్డలు ఉన్నత స్థితికి వెళ్లాలని అమ్మానాన్నలు కోరుకుంటారు. అందుకోసం వారు రేయింబవళ్లు కష్టపడి.. బిడ్డలను చదివిస్తుంటారు. ఈక్రమంలో కొందరు పిల్లలు..తల్లిదండ్రులు కోరుకున్నట్లే మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతుంటారు. మరికొందరు మాత్రం వివిధ కారణాలతో మంచిగా స్థిరపడేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో బిడ్డల భవిష్యత్తు గురించి తలుచుకుని అమ్మలు మానసిక వేదనకు గురవుతుంటారు. తాజాగా ఓ తల్లి.. కుమారుడు పరీక్షల్లో ఫెయిలయ్యాడని దారుణమైన నిర్ణయం తీసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ లోని జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారంలో  విషాద ఘటన చోటుచేసుకుంది.  గాజుల రామారంలో నాగభూషణం, పుష్పజ్యోతి(41) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగభూషణం ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. పుష్పజ్యోతి గృహిణి. ఆ దంపతుల కుమారుల్లో ఒకరు ఛార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) చదువుతున్నాడు. కొన్నిరోజుల క్రితం జ్యోతి కుమారుడు సీఏ పరీక్షలు రాశాడు. ఇటీవల సీఏ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఆ సీఏ ఫలితాల్లో జ్యోతి కుమారుడు ఉత్తీర్ణుడు కాలేదు. దీంతో అతడి తల్లి పుష్పజ్యోతి మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఇప్పటికే పలుమార్లు జ్యోతి కుమారుడు సీఏ రాసినట్లు.. స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన సీఏ ఫలితాల్లో ఉత్తీర్ణత కాలేదు.

దీంతో కొడుకు భవిష్యత్తుపై జ్యోతి బెంగ పెట్టుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబీకులు గమనించి కిందకు దించగా అప్పటికే ఆమె మృతి చెందారు. స్థానికులు అందించిన సమాచారంతో  పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా.. ప్రతి సమస్యకు చావే పరిష్కరం కాదని, సమస్యలపై పోరాటం చేయాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  ఆఫీసులో మహిళా ఉద్యోగి గలీజ్ దందా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు!