iDreamPost

సరదా కోసం చేసిన పని.. యువతి ప్రాణం తీసింది!

ఎంతో మంది యువత సరదా కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అడవులు, నది, సముద్రం వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇలా వెళ్లిన సందర్బంలో కొన్ని సార్లు.. వీరి సరదా ప్రాణాలనే బలి తీసుకుంటుంది.

ఎంతో మంది యువత సరదా కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అడవులు, నది, సముద్రం వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇలా వెళ్లిన సందర్బంలో కొన్ని సార్లు.. వీరి సరదా ప్రాణాలనే బలి తీసుకుంటుంది.

సరదా కోసం చేసిన పని.. యువతి ప్రాణం తీసింది!

మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది.  ఈ జర్నీల్లో ఎవరి సమయం వస్తే వారు దిగి పోవాల్సిందే. ఈ మధ్యలో ఏర్పడే బంధాలు, అనుబంధాలు మనిషిని బంధి చేస్తాయి. ఈ క్రమంలోనే అయిన వారు అనుకోకుండా మృత్యుఒడడికి చేరితే.. ఆ వేదన భరించలేనిది. ఇలా  విధిరాత కారణంగా కొందరు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మన చేతులారా చేసుకునే కొన్ని పనులు, మన సరదాలు కూడా ప్రాణాలు పోయేలా చేస్తాయి. తాజాగా ఎంతో జీవితం అనుభవించాల్సిన యువతి.. ఓ చిన్న తప్పు కారణంగా విగతజీవిగా మారింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్ణాటక  రాష్ట్రం దొడ్డబళ్లాపురం తాలుకలోని అరళికట్టె గ్రామానికి చెందిన నిత్య(19) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. నిత్య  పదో తరగతి వరకు స్థానికంగా ఉండే పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. స్థానిక పట్టణంలో నిత్య ఇంటర్ చదువుతున్నట్లు సమాచారం. ఆమె తల్లిదండ్రులు స్థానికంగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిత్య అంటే ఆమె తల్లిదండ్రులకు ఎంతో ప్రాణం. అల్లారు ముద్దుగా, ఏ కష్టం రాకుండా పెంచుకున్నారు. ఇక తమ కుమార్తె జీవితంపై వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆమె బాగా చదువుకుని ఉన్నత స్థాయి  చేరుకోవాలని కోరుకున్నారు. ఇలా సాగుతున్న వారి జీవితంలో అనుకోకుండా విషాదం చోటుచేసుకుంది.

young women passed away

హనుమాన్ జయంతి సందర్భంగా హాసన్ జిల్లా గోరూరు గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది.  ఇక ఆ గ్రామ శివారులో ఆంజనేయ స్వామి  దేవాలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. నిత్య కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు గుడి వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసింది.  అనంతరం సరదాగా పక్కనే ఉన్న హేమావతి నది కాలువలోకి దిగింది. లోతుగా ఉన్న చోట కాలు పెట్టడంతో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి.. మృతి చెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది కాలువ వద్దకు చేరుకున్నారు.

చాలా సమయం పాటు నిత్య డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేపట్టి.. ఎట్టకేలకు వెలికి తీశారు. ఈ ఘటనపై గొరూరు పోలీసులు  కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఇలా సరదా కోసం సెల్ఫీలు, నది లోపలకి వెళ్లి.. ఎంతో మంది యువత ప్రాణాలు తీసుకున్నారు. ఎంజాయ్ చేస్తున్నామనే ఆలోచనలో పొంచి ఉన్న మృత్యువును గుర్తించలేక పోతున్నారు. ఇలా ఎందరో యువత నది, కాలువల్లో ప్రమాదవశాత్తు పడి.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.  ఇలా సరదాల కారణం జరుగుతున్న ప్రమాదాలను ఎలా నివారించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి