iDreamPost

జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది! కానీ క్షణికావేశంలో..

జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది! కానీ క్షణికావేశంలో..

మానవ జన్మ అనేది చాలా అరుదుగా వచ్చేది. ఇలాంటి అరుదైన జన్మను పరిపూర్ణంగా ఆస్వాదించాలి. కష్టాలు,సుఖాలనేవి జీవితంలో ఒక భాగము. ఏవి శాశ్వతంగా జీవితంలో ఉండవు. అయితే కొందరు సుఖాలకు సంతోష పడి.. కష్టాలు రాగానే కంగారు పడిపోతుంటారు. ముఖ్యంగార నేటికాలంలో కొందరు సమస్యలను ఎదుర్కొనే  ధైర్యం లేక.. చావే పరిష్కారం భావించి.. ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. కనీపెంచిన తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చుతారు. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

నిజమాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రానికి చెందిన గోలి వెంకట రాములు, సత్తెమ్మ  దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు  ఉన్నారు. వీరి రెండో కుమార్తె రక్షిత(20) ఆర్మూర్ లోని  నరేంద్ర మహిళ డిగ్రీ కళాశాలలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది. షెడ్యూల్ కులాల వసతి గృహంలో ఉంటూ రక్షిత తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఆదివారం  రాత్రి వసతి గృహంలో  ఫ్యాన్ కు  ఉరి వేసుకుని రక్షిత ఆత్మహత్యకు పాల్పడింది.   ఆదివారం రాత్రి భోజనాలు చేసి వచ్చిన తోటి విద్యార్థినులు రక్షిత తలుపు తీయకపోవడంతో .. అనుమానంతో కిటికిలో నుంచి చూశారు.

రక్షిత ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే వారందరు కలిసి తలుపులను బద్దలు కొట్టి లోపలి వెళ్లారు. రక్షితాను కిందకు దించి.. ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రక్షితను పరీక్షించిన వైద్యులు.. ఆమె మరణించినట్లు ధృవీకరించారు. అయితే స్నేహితురాలిని కాపాడేందుకు తోటి విద్యార్థినులు  చూపిన ధైర్యంకి అందరు ప్రశంసించారు. ఇక రక్షిత మృతి వార్తను ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఆస్పత్రికి వచ్చారు. డిగ్రీ పూర్తి చేసుకుని ఇంటికి వస్తుందనకుంటే.. విగత జీవిగా మారిందంటూ రక్షిత తల్లిదండ్రులు భోరు విలపించారు. అయితే అందరితో ఎంతో కలివిడిగా ఉండే రక్షిత ఆత్మహత్య చేసుకోవడం తోటి విద్యార్థులను తీవ్రంగా కలిచి వేసింది.

రక్షిత ఆత్మహత్యను నమ్మలేకపోతున్నామని హాస్టల్ వార్డెన్ ఫర్జాన్ బేగం తెలిపారు. రక్షిత స్వగ్రామమైన మెండోరాలో విషాధ ఛాయాలు అలుముకున్నాయి. ఉపాధి కోసం రక్షిత తండ్రి దుబాయ్ వెళ్లారు. ఆయన వచ్చిన తరువాత రక్షిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరి.. సమస్య ఏదైన ఇలా యువత చావే పరిష్కారంగా ఎంచుకోవడం అందరిని కలచి వేస్తుంది. మరి.. యువత ఆత్మహత్యల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి