iDreamPost

భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త ఎంత పనిచేశాడంటే!

Bengaluru Crime News : అందమైన భార్య, హ్యాపీగా సాగి పోతున్న సంసారం. పిల్లల విషయంలో వచ్చిన గొడవ కారణంగా భర్త దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.

Bengaluru Crime News : అందమైన భార్య, హ్యాపీగా సాగి పోతున్న సంసారం. పిల్లల విషయంలో వచ్చిన గొడవ కారణంగా భర్త దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.

భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త ఎంత పనిచేశాడంటే!

వివాహబంధం ఎంతో పవిత్రమైనది. వేద మంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను బంధుమిత్రులు నూరేళ్లు కలిసి ఉండాలని ఆశీర్వదిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు, కొట్లాట కారణంగా భార్యాభర్తలు విడిపోతున్నారు. దీనికి కారణం పని ఒత్తిడి, ఆదిపత్య పోరు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధలు. ఇలా ఎన్నో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి విడిపోతున్నారు. కొన్నిసార్లు గొడవల కారణంగా తీవ్ర డిప్రేషన్ లోకి వెళ్లి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కట్టుకున్న భార్యను కనికరం లేకుండా హతమార్చాడు భర్త. ఈ ఘటన బెంగుళూరు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులోని హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్న సంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను దారణంగా హతమార్చాడు ఓ కసాయి భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భత్కల్ కు చెందిన గిరిజ (30) ని బెంగుళూరుకు చెందిన నవీన్ తో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. నవీన్ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండగా.. గిరిజ ఓ గార్మెంట్స్ లో పనిచేస్తుంది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గిరిజ కుటుంబ సభ్యులు ప్రేమను వ్యతిరేకించారు. కుటుంబ సభ్యులను ఒప్పించి ఎనిమిది నెలల క్రితం నవీన్, గిరిజ వివాహం చేసుకున్నారు.

ఇద్దరూ బెంగుళూర్ లో స్థిరపడ్డారు. పెళ్లయ్యాక గిరిజకి గర్భస్రావం అయింది. దీని తర్వాత నవీన్ ఇప్పట్లో పిల్లలు వద్దు అని చెప్పాడు. కానీ గిరిజ మాత్రం తనకు బిడ్డ కావాలని పట్టుబట్టింది. ఈ విషయమై ఇద్దరి మధ్య రోజూ గొడవలు జరుగుతూ వచ్చాయి. భార్యతో తరుచూ గొడవలు పడుతున్న నవీన్ తీవ్ర అసహనానికి గురయ్యాడు.. తన భార్యను చంపేయాలని నిశ్చయించుకున్నాడు. ఏప్రిల్ 12 న నిద్రిస్తున్న తన భార్య గొంతు కోసి హత్య చేశాడు. గిరిజ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకొని నిందితుడు నవీన్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి