iDreamPost
android-app
ios-app

ఛీ… ఈమె అసలు తల్లేనా.. కన్నకొడుకును దారుణంగా..

ఇటీవల భార్యాభర్తలు అభిప్రాయ భేదాలు, వివాహేతర సంబంధాల కారణంగా విడిపోతున్నారు. అంతేకాదు తమ అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని తమ పిల్లలను సైతం హతమార్చుతున్నారు.

ఇటీవల భార్యాభర్తలు అభిప్రాయ భేదాలు, వివాహేతర సంబంధాల కారణంగా విడిపోతున్నారు. అంతేకాదు తమ అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని తమ పిల్లలను సైతం హతమార్చుతున్నారు.

ఛీ… ఈమె అసలు తల్లేనా.. కన్నకొడుకును దారుణంగా..

ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఆ సమయంలో క్షిణికావేశానికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం.. ఎదుటి వారిని హత్య చేయడం లాంటివి చేస్తున్నారు. చాలా వరకు పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. అక్రమ సంబంధాలు కారణంగా విడిపోయిన భార్యాభర్తలు తమకు అడ్డు వస్తున్నారని పిల్లలను సైతం చంపేస్తున్న దారుణ ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ తల్లి తన నాలుగేళ్ల కొడుకును చంపి బ్యాగ్ లో పెట్టుకొని పారిపోయింది.. ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

ఓ మహిళ వ్యాపారవేత్త తన కుమారుడిని చంపిన తర్వాత ఒక బ్యాగు‌లో పెట్టుకొని గోవా నుంచి కర్ణాటకకు బయలుదేరించింది. హూటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కర్ణాటకలోని చిత్ర దుర్గం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన మైండ్ ఫుల్ ఏఐ ల్యాబ్ కంపెనీ సీఈఓ అయిన సుచనా సేథ్ (39) తన నాలుగేళ్ల కొడుకు తో కలిసి ఈ నెల 6న గోవాకు వెళ్లింది. అక్కడ ఓ హూటల్ లో రూమ్ తీసుకొని ఉంది.  హూటల్ నుంచి వెళ్లిపోయిన తర్వాత రూమ్ శుభ్రం చేస్తుండగా రక్తపు మరకలు కనిపించడంతో సిబ్బంది హూటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వెంటనే హూటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు.

సుచనా సేథ్ హూటల్ కి వచ్చే సమయంలో తన నాలుగేళ్ల బాబుతో ఎంట్రీ ఇచ్చింది. కానీ వెళ్లేముందు ఒంటరిగా వెళ్ళడాన్ని గమనించారు. గోవా నుంచి ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్లిన సుచనాపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ట్యాక్సీ డ్రైవర్ కి ఫోన్ చేసి సుచనాతో మాట్లాడారు. తన స్నేహితుడి వద్ద కుమారుడిని ఉంచానని చెప్పింది. వెంటనే ఆ స్నేహితుడి వివరాలు ఇవ్వాలని కోరారు.. ఆమె ఇచ్చిన అడ్రస్ ఫేక్ అని తేలింది. దీంతో ట్యాక్సీ డ్రైవర్ కి ఓ పోలీస్ స్టేషన్ ముందు ఆపాలని  కొంకణీ బాషలో చెప్పారు పోలీసులు. కర్ణాటక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిత్రదుర్గ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బ్యాగులో చిన్నారి మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సుచనాని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి