iDreamPost

భార్యాభర్తల మధ్య వాగ్వాదం..భార్యపై భర్త దారుణం!

Bangalore Crime News: ఇటీవల చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ఎదుటివారిపై దాడులు చేయడం, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు.

Bangalore Crime News: ఇటీవల చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ఎదుటివారిపై దాడులు చేయడం, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు.

భార్యాభర్తల మధ్య వాగ్వాదం..భార్యపై భర్త దారుణం!

వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు చల్లగా కలిసి మెలిసి జీవించాలని పెద్దలు, బంధుమిత్రులు ఆశీర్వదిస్తారు. భర్తతో కలిసి ఏడడుగులు నడిచిన భార్య కోటి ఆశలతో అత్తవారింటిలోకి అడుగు పెడుతుంది. భర్త, పిల్లలు, అత్త మామలకు సేవ చేస్తూ ఇంటిని చక్కబెడుతుంది. కొంతమంది అత్తింటి వారు.. భర్త ఇచ్చిన కట్నం సరిపోలేదని కోడళ్లను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. తమకు అదనపు కట్నం కావాలని.. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని హింసించి చంపుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి దారుణ ఘటన బెంగుళూరు  జరిగింది. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు కామాక్షి పాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చీరతో భార్య గొంతు బిగించి హత్య చేశాడు ఓ భర్త. మృతురాలి పేరు నేత్రావతిగా పోలీసులు గుర్తించారు. భార్యను హత్య చేసిన అనంతరం భర్త వెంకటేశ్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఉదయం ఇరుగుపొరుగు వారు చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు పోలీసులు. ఈ ఘటనపై కామాక్షీ పాళ్య పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా.. పోలీసులు హంతకుడు వెంకటేశ్ ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హంతకుడు వెంకటేశ్ నాలుగేళ్ల క్రితం నేత్రావతిని పెళ్లి చేసుకొని కామాక్షి పాళ్యం రంగనాథపురంలో నివాసం ఉంటున్నాడు. వెంకటేశ్ క్రేన్ ఆపరేటర్ గా పనిచేసేవాడు. కొంత కాలంగా మద్యానికి భానిసైన వెంకటేశ్ తరుచూ ఇంట్లో భార్యపై గొడవ పెట్టుకునేవాడు. వీధిలోకి వచ్చి నానా రచ్చచేసేవాడు. భార్య తమ పరువు పోతుందని ఎంత వేడుకున్నా మాట వినకపోగా..ఆమెపై చేయి చేసుకునేవాడని స్థానికులు చెబుతున్నారు. నేత్రావతి గార్మెంట్స్ లో పనిచేసేది.. భార్య వద్ద డబ్బు బలవంతంగా తీసుకుపోయి తాగేవాడు వెంకటేశ్. కొంత కాలంగా తనకు డబ్బు కావాలి పుట్టింటికి వెళ్లి తీసుకురావాలని బలవంతం చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరు మధ్య గొడవ జరిగి ఆమెను చీర కొంగుతో ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశాడు. మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించామని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి