iDreamPost

ఆస్ట్రేలియాలో NRI దారుణ హత్య.. ఆ ఒక్క కారణంతోనే..

Australia Crime News: ఈ మధ్య చాలా మంది యువత ఉన్నతవిద్యనభ్యసించడానికి విదేశాలకు వెళ్తున్నారు. చదువులు అయ్యాక కొంతమంది అక్కడే స్థిరపడుతున్నారు.. చాలా మంది భారత దేశానికి తిరిగి వచ్చేస్తున్నారు. ఇటీవల విదేశాల్లో భారతీయులపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి

Australia Crime News: ఈ మధ్య చాలా మంది యువత ఉన్నతవిద్యనభ్యసించడానికి విదేశాలకు వెళ్తున్నారు. చదువులు అయ్యాక కొంతమంది అక్కడే స్థిరపడుతున్నారు.. చాలా మంది భారత దేశానికి తిరిగి వచ్చేస్తున్నారు. ఇటీవల విదేశాల్లో భారతీయులపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి

ఆస్ట్రేలియాలో NRI దారుణ హత్య.. ఆ ఒక్క కారణంతోనే..

ఇటీవల చిన్న చిన్న విషయాలకే చాలా మంది తీవ్ర మనస్థాపానికి గురైతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం కొన్నిసార్లు హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఉన్నత విద్యనభ్యసించడానికి ఇతర దేశాలకు వెళ్లిన యువత పలు కారణాల వల్ల దారుణ హత్యలకు గురవుతున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. బంగారం లాంటి భవిష్యత్ కలలు కన్నవారి జీవితాలు అర్థాంతరంగా ముగిసి పోతున్నాయి.  ఓ ఎన్ఆర్ఐ దారుణ హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపింది. చిన్న కారణంతోనే ఆ యువకుడిని హత్య చేశారని పోలీసులు తెలిపాారు.  ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియాలో హర్యానాకు చెందిన నవ్ జీత్ సంధూ అనే విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నవ్‌జీత్ సంధూ కేసులో ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేశారు. విక్టోరియా పోలీస్ హుమిసైడ్ డిటెక్టీవ్ లు మంగళవారం పరారీలో ఉన్న నింధితులు అభిజిత్ (26), రాబిన్ గార్టాన్ (27) ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు, నిందితులు హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన వారిగా తెలుస్తుంది. ఈ నవ్ జీత్ సంధూ మరణ వార్త విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

మెల్పోర్న్ లోని ఓర్మాండ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నవ్‌జీత్ సంధూ హత్యకు గురయ్యాడు. సంధూని నిందితులు ఛాతిపై దారుణంగా పొడిచి చంపారు. గత కొన్నిరోజులుగా ఇంటి రెంట్ విషయంలో కొంతమంది విద్యార్థుల మద్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో నవ్‌జిత్ సంధూ మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించాడు. ఆ ఒక్క కారణంతోనే అతన్ని దారుణంగా హత్య చేశారని సంధూ బంధువులు తెలిపారు. అయితే నింధితులు ఇద్దరూ అన్నదమ్ములుగా తెలిసింది. ఎంటెక్ చదివేందుకు 2022 లో మెల్బోర్న్‌ కి వెళ్లాడు నవ్‌జీత్ సంధూ. తల్లిదండ్రులకు అతడు ఒక్కడే కుమారుడు. వీరిది ఒక సామాన్య రైతు కుటుంబం. తమ వద్ద డబ్బు లేదని.. ఎలాగైనా ఆదుకోవాలని నవ్‌జీత్ సంధూ తల్లిదండ్రులు ఆన్ లైన్ లో గోఫండ్ మీ పేజ్ ద్వారా నిధులు సేకరణ ప్రారంభించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి