iDreamPost
android-app
ios-app

అనుమానాస్పదంగా మూడేళ్ల బాలుడి మృతి.. చిన్న క్లూతో బయటపడ్డ నిజం..

  • Published Feb 22, 2024 | 10:04 PM Updated Updated Feb 22, 2024 | 10:04 PM

Annamayya District Crime News: నేరం ఎంత గుట్టుగా పకడ్భందీగా చేసినా.. ఏదో ఒక చిన్న క్లూ దోషులను పట్టిస్తుంది. ఒక చిన్న క్లూ ఇద్దరు దంపతులను పోలీసులకు పట్టించింది.

Annamayya District Crime News: నేరం ఎంత గుట్టుగా పకడ్భందీగా చేసినా.. ఏదో ఒక చిన్న క్లూ దోషులను పట్టిస్తుంది. ఒక చిన్న క్లూ ఇద్దరు దంపతులను పోలీసులకు పట్టించింది.

  • Published Feb 22, 2024 | 10:04 PMUpdated Feb 22, 2024 | 10:04 PM
అనుమానాస్పదంగా మూడేళ్ల బాలుడి మృతి.. చిన్న క్లూతో బయటపడ్డ నిజం..

ఇటీవల టెక్నాలజీ వచ్చిన తర్వాత కొంతమంది నేరస్థులు ఎన్నో నేరాలు చేస్తూ తప్పించుకుంటున్నారు. అయితే పోలీసులు టెక్నాలజీ ఉపయోగించిన నేరస్థులు ఏ అలుగులో దాక్కున్నా పట్టేస్తున్నారు. ఇటీవల వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు వెళ్తున్నారు. కొంతమంది మంది తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారని కనీపెంచిన పిల్లలను కూడా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ కసాయి తల్లి చేసిన దారుణం ఏపీలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ కన్న తల్లి కర్కశంగా మారి మూడేళ్ల కొడుకును అతి దారుణంగా చంపేసింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంగా ప్రియుడితో కలిసి ఈ దుర్మార్గానికి తెగబడింది. బాలుడిని కడతేర్చిన తల్లి ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి మదనపల్లి రూరల్ పోలీసులు జైలుకు పంపారు. ఈ ఘటన మదనపల్లిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 13 న చిప్పిలిలో మూడేళ్ల సాకేత్ ఇంట్లో నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. తల్లి మయూరి తనకుమారుడు నీటి తొట్టిలో పడి చనిపోయాడని అందరినీ నమ్మించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు.

దర్యాప్తులో భాగంగా తల్లి మయూరిని తమదైన స్టైల్లో ప్రశ్నించారు.. ఈ క్రమంలోన అసలు నిజం బయటపెట్టింది బాలుడి తల్లి. పులిచెర్ల మండలం కల్లూరు కు చెందిన నాగరాజు తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ జంట మద్యలోకి శివ శంకర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. నాగరాజు లేని సమయంలో తరుచూ శివ ఇంటికి వచ్చి ఆమెతో శృంగారంలో పాల్గొనేవాడు. ఇద్దరూ సహజీవనం చేసేదాక వెళ్లింది. దీంతో రెండేళ్ల క్రితం భర్తను వదిలి కొడుకు సాకేత్ ని తీసుకొని శిశ శంకర్ రెడ్డితో వెళ్లిపోయింది మయూరి. కొంత కాలానికి వీరి అక్రమ సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని శివ శంకర్ చిన్నారి సాకేత్ ని తీవ్రంగ కొట్టాడు. దీంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లి సాకేత్ చనిపోయాడు. మయూరి సహాయంతో నీటితోట్టిలో పడవేసి.. తన కొడుకు ప్రమాదవశాత్తు చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. కానీ బాలుడిపై ఒంటిపై దెబ్బలు ఉండవ చూశారు పోలీసులు. ఆ ఒక్క క్లూతో తమదైన శైలిలో విచారించి వీరి గుట్టు బయటపెట్టారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు పోలీసులు.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet