iDreamPost

Tirumala: తిరుమల వెంకన్న భక్తులకు గుడ్​న్యూస్.. టికెట్లు లేకపోయినా దర్శనం!

  • Published Jan 02, 2024 | 8:27 AMUpdated Jan 02, 2024 | 8:27 AM

తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు గుడ్​న్యూస్. టికెట్లు లేకపోయినా శ్రీవారిని దర్శించుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు గుడ్​న్యూస్. టికెట్లు లేకపోయినా శ్రీవారిని దర్శించుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 02, 2024 | 8:27 AMUpdated Jan 02, 2024 | 8:27 AM
Tirumala: తిరుమల వెంకన్న భక్తులకు గుడ్​న్యూస్.. టికెట్లు లేకపోయినా దర్శనం!

ఏడుకొండల మీద కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎంతో శ్రమకు ఓర్చి, సుదూరాల నుంచి తిరుమల కొండ మీదకు చేరుకుంటారు. అలాంటి వెంకన్న భక్తులకు గుడ్​న్యూస్. ఇవాళ్టి నుంచి టికెట్లు లేకపోయినా స్వామి వారి దర్శనానికి వెళ్లొచ్చు. శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనం పూర్తయింది. గతేడాది డిసెంబర్ 23వ తేదీన మొదలైన వైకుంఠ ద్వార దర్శనం సోమవారం రాత్రితో ముగిసింది. దీంతో అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాల్ని మూసివేశారు. అలాగే శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తుల్ని అనుమతించడంతో వారు దర్శనాలు పూర్తి చేశారు. గత పదిరోజులుగా టికెట్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇవాళ్టి నుంచి టికెట్లు లేని వాళ్లు కూడా దర్శనానికి వెళ్లొచ్చు.

తిరుపతిలో సర్వదర్శనం టైమ్​ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు నేటి (మంగళవారం) నుంచి దర్శనం కల్పించనున్నారు. తిరుపతిలోని కౌంటర్లలో ఇవాళ్టి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ రీస్టార్ట్ కానుంది. డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ దాకా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శన టోకెన్లను మంగళవారం ఉదయం 4 గంటల నుంచి జారీ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు స్టార్ట్ అవుతాయి. అలాగే నేటి నుంచి టికెట్లు లేని వాళ్లను కూడా వెంకన్న దర్శనానికి అనుమతిస్తారు. ఇక, గత సంవత్సరం తిరుమల వేంకటేశ్వరుడ్ని 2.54 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.1,403.74 కోట్ల ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తెలిపింది.

good new for ttd devotees

గతేడాది జనవరి నెలలో తిరుమల శ్రీవారిని 20.78 లక్షల మంది దర్శించుకున్నారు. ఆ నెలలో హుండీ ఆదాయం రూ.123.07 కోట్లు లభించింది. ఫిబ్రవరిలో రూ.114.29 కోట్లు, మార్చిలో రూ.120.29 కోట్లు, ఏప్రిల్​లో రూ.114.12 కోట్లు, మేలో రూ.109.99 కోట్లు, జూన్​లో రూ.116.14 కోట్లు, జులైలో రూ.129.08 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఆగస్టు నెలలో రూ.120.05 కోట్లు, సెప్టెంబరులో రూ.111.65 కోట్లు, అక్టోబర్​లో రూ.108.65 కోట్లు, నవంబర్​లో రూ.108.46 కోట్లు, డిసెంబర్​లో రూ.116.07 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఇటీవల వైకుంఠ ఏకాదశి రోజు హుండీ ఆదాయం రూ.5.05 కోట్లు లభించింది. కరోనా తర్వాత 2022 మార్చి నుంచి ప్రత్యేక దర్శనాలతో పాటు టోకెన్ రహిత దర్శనాలు, ఆర్జిత సేవలన్నీ మొదలైన క్రమంలో శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెలా రూ.100 కోట్లు దాటుతోంది.

ఇదీ చదవండి: Tirupati: తిరుపతి జిల్లాలో జల్లికట్టు పోటీలు.. 14 మందికి గాయాలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి