iDreamPost

Tirupati: తిరుపతి జిల్లాలో జల్లికట్టు పోటీలు.. 14 మందికి గాయాలు!

కొత్త సంవత్సరం వేడుకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. కొంతమంది కొత్త ఏడాది బాగా కలిసి రావాలని, తమ కుటుంబం సంతోషంగా ఉండాలని దేవాలయాలకు వెళ్లి పూజలు జరిపిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో రక రకాల పోటీలు నిర్వహిస్తూ గెలిచిన వారికి బహుమతులు ఇస్తుంటారు.

కొత్త సంవత్సరం వేడుకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. కొంతమంది కొత్త ఏడాది బాగా కలిసి రావాలని, తమ కుటుంబం సంతోషంగా ఉండాలని దేవాలయాలకు వెళ్లి పూజలు జరిపిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో రక రకాల పోటీలు నిర్వహిస్తూ గెలిచిన వారికి బహుమతులు ఇస్తుంటారు.

Tirupati: తిరుపతి జిల్లాలో జల్లికట్టు పోటీలు.. 14 మందికి గాయాలు!

తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెబుతూ ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తొలిరోజు ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది తమకు అంతా శుభం జరగాలని దేవుడిని ప్రార్ధించేందుకు దేవాలయాలకు వెళ్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందినవారు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తిరుపతి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు వినూత్నంగా జరుపుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో సంప్రదాయ క్రీడలు నిర్వమిస్తూ యువత సంబరాలు జరుపుకుంటున్నారు.  వివరాల్లోకి వెళితే..

నూతన సంవత్సర వేడుకల సందర్బంగా తిరుపతి జిల్లా లో జల్లికట్టు క్రీడ ప్రారంభం అయ్యింది. కొత్త ఏడాది తొలిరోజు చంద్రగిరి మండలం శానంబట్ల వాసులు హుషారుగా జల్లికట్టు నిర్వహించారు. ప్రతి సంవత్సరం చంద్రగిరి మండలం శానంబట్ల గ్రామంలో జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అంటున్నారు. ఇక్కడ దున్నలకు కొంతమంది రాజకీయ నేతలు, అభిమాన హీరోల ఫోటోలు పెట్టి బరిలో దింపుతారు. రంకెలు వేసుకుంటూ వస్తున్న ఎద్దులను యువకులు నిలువరించే ప్రయత్నం చేస్తుంటారు. ఎద్దుల కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలోనే 14 మంది యువకులు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వైద్యులు తెలిపారు.

ఈ జల్లికట్టు క్రీడను స్థానికులే కాదు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి వస్తుంటారు. సాధారణంగా జల్లికట్టు ఎక్కువగా తమిళనాడు లో ఆడుతుంటారు. అయితే తిరుపతి తమిళనాడుకి దగ్గర ప్రాంతం.. ఇక్కడ కొంతమంది అక్కడ సంప్రదాయాలను పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే చంద్రగిరి మండలం శానంబట్ల గ్రామంలో అనాధిగా జల్లికట్టు క్రీడను ఆడుతున్నారు. ఈ క్రీడలో కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి