sunil
Times Now ETG Research Survey: ఏపీ ఎన్నికలకు సంబంధించి టైమ్స్ నౌ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..
Times Now ETG Research Survey: ఏపీ ఎన్నికలకు సంబంధించి టైమ్స్ నౌ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..
sunil
మరి కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు.. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. ప్రస్తుతం పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో గతేడాదే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏపీలో వైసీపీ, విపక్ష కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఎన్నికలు సమయం దగ్గర పడుతుండటంతో.. ఎన్నికల ఫలితాలకు సంబంధించి సర్వేలు, ఒపినియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి.. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని వెల్లడిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా, టైమ్స్‌నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల్లో అధికార వైసీపీనే అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని తేల్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్‌సభ ఎన్నికల్లో 21-22 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే వెల్లడించింది. ఇక విపక్ష కూటమికి 3-4 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తాజా సర్వేతో ఏపీలో మరోసారి వైసీపీ హవా కొనసాగనుందని స్పష్టం అయ్యింది.
మరోవైపు, తెలంగాణలోని 17 స్థానాలకు జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకే అధిక సీట్లు వస్తాయని టైమ్స్‌నౌ సర్వే వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 8-10 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ఇక, బీజేపీకి 4-6 ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1-3 ఎంపీ స్థానాలు దక్కుతాయని చెప్పుకొచ్చింది. సర్వేలు ఏవైనా సరే.. ఏపీలో అధికారం మాత్రం వైసీపీదే అని స్పష్టం చేస్తున్నాయి.
TIMES NOW- @ETG_Research Survey
Andhra Pradesh (Total Seats: 25) || Here are seat share projections-
– YSRCP: 21-22
– BJP: 0
– TDP+JSP: 3-4
– Others: 0Watch as @navikakumar shares more details. pic.twitter.com/CdIxog58lk
— TIMES NOW (@TimesNow) April 4, 2024