iDreamPost

ఆసక్తిరేపుతున్న థియేట్రికల్ రిలీజెస్! ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!

  • Author ajaykrishna Published - 01:59 PM, Tue - 3 October 23
  • Author ajaykrishna Published - 01:59 PM, Tue - 3 October 23
ఆసక్తిరేపుతున్న థియేట్రికల్ రిలీజెస్! ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!

ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల వాయిదాల వల్ల రిలీజ్ డేట్స్ విషయంలో మీడియం, చిన్న సినిమాలు చాలా తంటాలు పడుతుంటాయి. ముఖ్యంగా ఈ ఏడాది సలార్ వాయిదా మిగతా రిలీజ్ లపై ఎలాంటి ప్రభావం చూపిందో చూశాం. అదే సలార్.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాక.. ఆ టైమ్ లో వస్తున్న సినిమాలు డేట్స్ మార్చుకునే పరిస్థితి నెలకొంది. సో.. పెద్ద సినిమాలు వస్తున్నాయంటే.. చిన్న, మీడియం సినిమాలు ఖచ్చితంగా వెనకాముందు వాయిదా పడటం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు.. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు మధ్య క్లాష్ ఏర్పడుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో అక్టోబర్ మొదటి వారం అలాంటి క్లాష్ జరగబోతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది సినిమాకు అక్టోబర్ 6న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని ఆల్రెడీ సూపర్ బజ్ క్రియేట్ చేసుకున్నాయి. మరికొన్ని ట్రైలర్స్ తో ఆసక్తి రేపుతున్నాయి. ఇంకొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. అయితే.. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలలో ముఖ్యంగా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన సినిమాలు నాలుగు ఉన్నాయి. అందులో సమ్మోహనుడా పాటతో పాపులర్ అయిన రూల్స్ రంజన్, సుధీర్ బాబు మూడు పాత్రలలో నటించిన మామా మశ్చీంద్ర.. సితార బ్యానర్ వారి మ్యాడ్.. అలాగే లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800. మరి ఈ నాలుగు కాకుండా ఇంకా ఏయే సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయో చూద్దాం!

అక్టోబర్ 6 థియేట్రికల్ మూవీస్:

      • రూల్స్ రంజన్
      • మ్యాడ్
      • మామా మశ్చింద్ర
      • మంత్ ఆఫ్ మధు

      • 800 (బయోపిక్)
      • చిన్నా (తమిళ డబ్)
      • ఎక్సర్సిస్ట్ (ఇంగ్లీష్ డబ్)

    • గన్స్ ట్రాన్స్ యాక్షన్
    • ఏందిరా ఈ పంచాయతీ
    • అభిరామచంద్ర

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి