iDreamPost

ఆసుపత్రిలో పెళ్లి.. చావుని జయించిన ఓ ప్రేమ కథ ఇది!

  • Published Jan 30, 2024 | 8:31 PMUpdated Jan 30, 2024 | 8:31 PM

చావు బ్రతుకుల్లో ఉన్న ప్రియురాలి కోరికను కాదనలేక ఓ ప్రియుడు ఎవరిని చేయలేని పనిని చేశాడు. కానీ, ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. అసలు ఏం జరిగిదంటే..

చావు బ్రతుకుల్లో ఉన్న ప్రియురాలి కోరికను కాదనలేక ఓ ప్రియుడు ఎవరిని చేయలేని పనిని చేశాడు. కానీ, ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. అసలు ఏం జరిగిదంటే..

  • Published Jan 30, 2024 | 8:31 PMUpdated Jan 30, 2024 | 8:31 PM
ఆసుపత్రిలో పెళ్లి.. చావుని జయించిన ఓ ప్రేమ కథ ఇది!

ప్రేమ అనేది హద్దులు లేని బంధం. ఈ ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులు ఒకరిపై ఒకరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే ఎటువంటి త్యాగానికైన వెనుకడారు. కానీ, ప్రస్తుత కాలంలోని ప్రేమ చాలా మలీనం అయిపోయింది. ఎక్కడలేని స్వార్థం, అసూయ, ద్వేషంతో నిండిపోతుంది. అది ఎలా అంటే.. ప్రాణకన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులను మోసం చేయడం, హత్యలు చేయడం వంటి ఘటనలు తరుచుగా చూస్తున్నాం. అయితే తాజగా ఓ ప్రేమ జంటను చూస్తే మాత్రం.. ప్రేమకు ఎప్పటికి చావు లేదు. అది ఎప్పుడు సహజీవంగా ఉంటుదని తెలిసింది. ప్రేమించిన అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉన్న తాన చేయిని విడువుకుండా బ్రహ్మముడి వేసుకున్నాడు ఓ ప్రియుడు. ఈ విధంగా ప్రేమ ఎంత పవిత్రమైనదో చాటి చెప్పే మధురమైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.ఆ వివరాళ్లోకి వెళ్తే..

కొన్ని ప్రేమ కథలు వింటే ఆదర్శంగా ఉంటాయి. మరికొన్ని ప్రేమ కథలు కన్నీరు పెట్టిస్తాయి. అచ్చం అలాంటి ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాకు చెందిన హీథర్, డేవిడ్ మోషర్ అనే ఇద్దరు ప్రేమికులు మొదటిసారిగా 2015లో స్వింగ్ డ్యాన్స్ క్లాస్ లో కలుసుకున్నారు. అలా తొలి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత మాటలు కలిసి, కొన్ని నెలలు డేటింగ్ చేశారు. అలా వారి ప్రేమ బంధం పెళ్లిదాకా అడుగులు వేయలని నిర్ణయించుకున్నారు. దీంతో బంధువులు, సన్నిహితులు మధ్య చాలా గ్రాండ్ గా నిశ్చితార్థన్ని చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2017, డిసెంబర్ 30న తమ పెళ్లి ముహుర్తన్ని కూడా ఖాయం చేసుకున్నారు. కానీ ఇంతలోనే ఊహించని పెద్ద అలజడి వారి జీవితాల్లో రేగింది. ఎందుకంటే.. హీథర్ చాలా ప్రమాదకరమమైన రొమ్ము కెన్సర్ అని నిర్ధారణ అయింది. అంతే.. ఒక్కసారిగా వారి జీవితాలు తారుమారైయ్యాయి.

దీంతో హీథర్ ప్రతి నెల టెస్ట్ లు, కీమోథెరపీలతో ఆసుపత్రుల చుట్టూ తిరగుతునే ఉంది. ఇంతలోనే హీథర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. వెంటనే ప్రియుడు డేవిడ్ ఆమెను కనెక్టికట్ లోని హార్ట్ ఫోర్డ్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్ లో ఉన్న తన ప్రియురాలిని కలవడానికి వెళ్లాడు. చావు బతుకుల మధ్య పోరాడుతున్న తన ప్రియురాలిని చూసిన డేవిడ్ ఉబికి వస్తున్న కన్నీళ్లను అదుముకున్నాడు. అయితే ఇంతలో హీథర్ తన ప్రియుడిని పెళ్లి చేసుకోమని కోరింది. కాగా, ప్రియురాలు అడిగిన కోరికను కాదనలేని డేవిడ్.. వెంటనే ఆసుపత్రినే మ్యారేజ్ ఫంక్షన్ హాలుగా, బెడ్ నే పెళ్లి వేదికగా మారింది. అలాగే హస్పిటల్ సిబ్బంది సమక్షంలో ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి జరిగిన 18 గంటల తర్వాత హీథర్ మరణించింది. దీంతో స్వచ్చమైన ప్రేమకు ఎప్పుడు మరణం ఉండదు. ఆ మరణం కేవలం మనిషికే కానీ, మనసుకు కాదని ఈ జంట ప్రపంచానికి చాటి చెప్పింది.

ఇందులో మరో విషాదం ఏమిటంటే.. పెళ్లి చేసుకోవాలనుకున్న డిసెంబర్ 30నే ప్లాంట్స్ విల్లే కాంగ్రెగేషనల్ చర్చిలో హీథర్ అంత్యక్రియలు ముగిసాయి. ఇంతటి విషాదకరమైన ఘటన 2018 అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను నాన్ ఈస్తటిక్ థింక్స్ అనే ఎక్స్ హ్యాండిల్ ఈ స్టోరీని ఎక్స్ లో మళ్లీ షేర్ చేసింది. దీంతో షేర్ చేసిన 14 గంటల్లోనే 17 మిలియన్ల వ్యూస్ లు వచ్చాయి. మరి, చావు బ్రతుకుల్లో ఉన్నా తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఈ ఆదర్శ ప్రేమికుడి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి