iDreamPost

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఓటిటి తప్పు కాదు

ప్రాక్టికల్  గా ఆలోచిస్తే ఓటిటి తప్పు కాదు

నిన్న ట్విట్టర్ లో న్యాచురల్ స్టార్ నాని పెట్టిన ట్వీట్ తో టక్ జగదీశ్ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. విధి లేని పరిస్థితుల్లో రెండోసారి క్రాస్ రోడ్స్ లో నిలబడాల్సి వచ్చిందని నిర్మాతల సంక్షేమం దృష్ట్యా ఓటిటి నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేస్తున్నట్టు అందులో చెప్పుకొచ్చాడు. ఆ మధ్య తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో థియేటర్ల ప్రాధాన్యత గురించి చాలా చెప్పిన నాని తన సినిమానే ఇలా ఓటిటిలో ఇవ్వడం పట్ల విమర్శలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో కొంచెం ఎమోషనల్ గానే వివరణ ఇచ్చాడు. థియేటర్ల ఫ్యాన్ బాయ్ గా తానెప్పుడూ పెద్ద తెరపైనే చూడాలని కోరుకుంటానని కానీ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవని చెప్పుకొచ్చాడు.

ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. నాని ఎంత ఎమోషనల్ గా ఆలోచించినా తనతో పాటు ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచించారు. అమెజాన్ ప్రైమ్ టక్ జగదీశ్ కు సుమారు 37 కోట్ల దాకా డీల్ ఇచ్చినట్టు తెలిసింది. ఎలా చూసుకున్నా ఈ మొత్తాన్ని థియేట్రికల్ రన్ లో రాబట్టడం దాదాపు అసాధ్యం. అందులోనూ గత ఏడాది నుంచి ఈ సినిమా వెయిటింగ్ లో ఉంది. నిర్మాతలకు పెట్టుబడుల మీద వడ్డీ భారం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఎవరికీ లేని ఇబ్బంది వీళ్ళకే ఉందా అంటే పడేవాళ్లకు తెలుస్తుంది బాధ అనే సామెత చెప్పక తప్పదు. ఇక్కడ నారప్ప ఉదాహరణను మర్చిపోకూడదు.

నిజానికి లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరిచారు కానీ ఓ పదిరోజుల పాటు స్థిరంగా వసూళ్లు రాబట్టే సినిమా ఇంకా ఏదీ రాలేదు. అన్నీ చిన్న చిత్రాలే. అంతగా చెప్పుకున్న ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా ఏడు కోట్ల మార్కు దాటడం కష్టమే. పాగల్ సంగతి సరేసరి. తిమ్మరుసు అంతో ఇంతో నష్టంతోనే బయటికి వచ్చింది. ఇక ఇష్క్ డిజాస్టర్ గురించి ఆల్రెడీ అందరూ మర్చిపోయారు. సో 30 కోట్లకు పైగా షేర్ వచ్చే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయో లేదో స్పష్టత రావాలంటే సీటిమార్, లవ్ స్టోరీలు వస్తే కానీ చెప్పలేం. అందుకే టక్ జగదీష్ విషయంలో ఎవరినీ తప్పు బట్టడానికి లేదు. కరోనా ప్రేరేపించకపోతే ఇవాళ ఈ చర్చే ఉండేది కాదుగా

Also Read : సినిమా ప్రమోషనంటే వట్టి మాటలే కాదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి