iDreamPost
android-app
ios-app

చైన్ స్నాచింగ్ చేసి పారిపోయే యత్నం.. ప్రాణాలు కోల్పోయిన దొంగ!

చైన్ స్నాచింగ్  చేసి పారిపోయే యత్నం.. ప్రాణాలు కోల్పోయిన దొంగ!

ఈమధ్యకాలంలో సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా చోరీలకు పాల్పడుతు పరుల సొమ్మును దొచుకెళ్లే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. అయితే ఈ చోరీలు చేసి..తప్పించుకునే క్రమంలో కొందరు దొంగలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి చైన్ స్నాచింగ్ చేసి పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే  అనుకొని విపత్తు ఎదురై.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

తెలంగాణ రాష్ట్రం పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం సర్వారంలో రాజ్‌కుమార్ అనే యువకుడు ఓ వివాహితను వేధించాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయి సమీపంలోని గ్రామంలోకి వెళ్లాడు. అక్కడ ఓ మహిళ మెడలో పుస్తెల తాడును లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే ప్రతిఘటించిన మహిళ గట్టి కేకలు వేసింది. దీంతో ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడి చేరుకున్నారు. వారిని చూసి సదరు యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ రెండు ఘటనల నుంచి తప్పించుకున్న రాజ్ కుమార్ మరోచోట మహిళ మెడలోనే బంగారు చైన్ ను కొట్టేశాడు.

అక్కడి నుంచి కూడా పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే  అనుకోకుండా సమీపంలోని చెరువు వైపు పరుగులు తీశాడు. పారిపోయే క్రమంలో చెరువులోని ఓ గుంతలో పడి పోయాడు. నీటిలో మునిగిపోయే  ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల్ని అడిగి మరిన్ని వివరాలు సేకరించారు. రెండు చోట్ల తప్పించుకున్న రాజ్‌కుమార్ మూడో చోట కూడా చోరీ చేసి వెళ్తూ.. ప్రమాదవశాత్తూ చనిపోయాడు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap