iDreamPost

మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి దిమ్మతిరిగే షాక్!

మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి దిమ్మతిరిగే షాక్!

సాధారణంగా జిల్లా కోర్టులు పెద్ద పెద్ద శిక్షలు, ముఖ్యంగా ఉరిశిక్షలు వేసిన ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. చాలా దారుణమైన కేసుల్లోనే జిల్లా కోర్టులు ఉరి శిక్షలు వేసిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడేళ్ల క్రితం బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించింది. మూడేళ్ల పాటు ఈ కేసుపై విచారణ సాగగా.. తాజాగా ఉరి శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఇక ఈ ఘటనకు సంబంథించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ లో కుసుమ వసంత, రంజిత్ రెడ్డి దంపతులు ఉన్నారు. వీరికి దీక్షిత్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. మహబూబాబాద్ లో రంజిత్ రెడ్డి జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. 2020 అక్టోబర్ 18న రంజిత్ రెడ్డి కుమారుడు దీక్షిత్ ఆడుకుంటున్న సమయంలో నిందితుడు మంద సాగర్ పథకం ప్రకారం బాలుడిని కిడ్నాప్ చేశాడు. అక్కడ నుంచి కే.సముద్రం మండలం అన్నారం శివారులో ఉన్న ధానమయ్య గుట్టపై తీసుకెళ్లి.. బాలుడిని హతమార్చాడు. అనంతరం బాలుడు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం దీక్షిత్ తండ్రికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే బాలుడ్ని వదిలేస్తానని చెప్పాడు. పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేశాడు.

మూడురోజుల అనంతరం తాళ్లపూసపల్లి సమీపంలో ఉన్న ధానమయ్య గుట్టలో దీక్షిత్ రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. అప్పటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి శనిగపురంకు చెందిన పంక్చర్ షాప్ నిర్వహుకుడు మంద సాగర్ నిందితుడిగా తేల్చారు పోలీసులు. చివరకు అతడిని  అరెస్ట్ చేసిన పోలీసులు వరంగల్ సెంట్రల్ జైల్లో పెట్టారు.  ఈ ఘటన  2020లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మూడేళ్లుగా విచారణ సాగగా.. ఉరి శిక్ష విధిస్తూజిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై నిందితుడు సాగర్ హైకోర్టులో అప్పీల్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. మరి.. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి