iDreamPost

AP: యువతి మిస్సింగ్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు!

AP: యువతి మిస్సింగ్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు!

ఇటీవల తరచూ మహిళలు, యువతలు అదృశ్యమవుతున్న ఘటనలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని పోలీసులు ఛేదించగా.. మరికొన్ని మిస్టరీగా మిగిలిపోతున్నాయి. కొన్ని ఘటనల్లో యువతులు అదృశ్యమైన గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదిస్తున్నారు. తాజాగా కూడా యువతి మిస్సింగ్ కేసును దిశ పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి మిస్సింగ్ కేసుకు సంబంధించిన వివరాలను వెళ్తే..

చిత్తూరు జిల్లా రొంపిచర్ల గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తికు ఓ కుమార్తె ఉంది. ఆయన కుమార్తె మంగళవారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వారిని, బంధువులను విచారించగా ఫలితం లేకపోయిందని సమాచారం. ఈక్రమంలో చంద్రశేఖర్.. తన కుమార్తె కనిపించడం లేదని మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే దిశ పోలీసులు నిముషాల వ్యవధిలో యువతి ఇంటికి చేరుకున్నారు.

అదృశ్యమైన యువతి వివరాలను తల్లిదండ్రుల నుండి సేకరించారు. యువతి బంధువులు, స్నేహితులను పోలీసు విచారించారు. చివరకు బాలాజీ అనే యువకుడితో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఇద్దరు కూడా తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే తిరుపతి లో ఉన్న టీమ్ కు రొంపిచర్ల పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు చేరుకునే సరికి బాలాజీ, యువతి పెళ్లి చేసుకోవడం జరిగింది. మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో వారిద్దరిని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.

యువతి, యువకుడి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిచి వారితో మాట్లాడించడం జరిగింది. యువతి ఇష్టప్రకారం ఉండవచ్చని తల్లిదండ్రులు కూడా సుముఖత వ్యక్తంచేశారు. కేవలం గంటల వ్యవధిలోనే తమ కూతురుని గుర్తించడంతో పాటు క్షేమంగా అప్పగించిన పోలీసులకు యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఫిర్యాదు అందగానే పోలీసులు ప్రతిస్పందించిన తీరుకు అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. యువతి మిస్సింగ్ కేసు విషయంలో పోలీసులు తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రీల్స్ మోజులో భార్య.. హత్య చేసిన భర్త!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి